ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.16,099 ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.3,099కే అందిస‍్తున్నట్లు తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ మార్చి 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహిస్తుంది. అంతకంటే ముందే రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేయొచ్చని తెలిపింది.
రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్‌పై ఆఫర్లు
దేశీయ మార్కెట్ ప్రకారం.. రియల్ మీ 8(4జీబీ, 128జీబీ) స్టోరేజ్ ధర రూ.16,099గా ఉంది. అయితే కొనుగోలు దారులు అతితక్కువ ధరకే సొంతం చేసుకునేలా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్ ధర కంటే భారీగా తగ్గనుంది. కొనుగోలు దారులు రియల్ మీ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర వెయ్యి తగ్గుతుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 15,099 ధరకు అందుబాటులోకి వస్తుంది.ఇక మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.13000 డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా మీ పథ స్మార్ట్ ఫోన్ ఉంటే.. రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్‌ను రూ.3వేలకే పొందవచ్చు.
Flipkart Big Saving Days start from midnight for the Plus users.#Flipkart pic.twitter.com/jH4AjzgvAn
— RANAXN (@ranaxn7) March 11, 2022