స్మార్ట్ ఫోన్లలో ఫ్లాగ్ షిప్ ఫోన్ల గురించి వినే ఉంటారు. కాకపోతే అవి కాస్త ధర ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సాధారణ మోడల్స్ కంటే భిన్నంగా ఎక్కువ పీచర్స్, మంచి డిజైన్స్ లో ఈ ఫోన్స్ తీసుకొస్తారు. వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటంది. అయితే ఇప్పుడు ఐకూకి చెందిన ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది.
ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ మోడల్స్ పై సందర్భాలను బట్టి ధరను తగ్గిస్తూ వస్తున్నాయి. అయితే ఇలా ధర తగ్గించడం కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ మోడల్ రిలీజ్ అయిన కొన్ని రోజులకు అలాంటి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో, కాస్త తక్కువ ధరతో కొన్ని కంపెనీల నుంచి స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు వీరి మోడల్ కు ధర తగ్గించడం వల్ల కచ్చితంగా ఆ ఇంపాక్ట్ కొత్త మోడల్ పై పడుతుంది. ముఖ్యంగా ఫ్లాగ్ షిప్ ఫోన్ల ధరలను తగ్గిస్తూ వస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు వినియోగదారులకు మాత్రం మంచి ఫోన్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఐకూకి చెందిన ఫ్లాగ్ షిప్ ఫోన్ చేరింది.
వివోకి చెందిన ఐకూ కంపెనీ పేరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ విభాగంలో బాగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్ కి సంబంధించిన చాలా మోడల్స్ కు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ కంపెనీ నుంచి ప్రీమియం రేంజ్ లో చాలా ఫ్లాగ్ షిప్స్ ఫోన్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఏ కంపెనీకి చెందిన ఫ్లాగ్ షిప్స్ ఫోన్లు అయినా కూడా కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. అందుకే వాటిని అన్ని కేటగిరీల వారు కొనుగోలు చేయరు. ఇప్పుడు ఐకూ సంస్థ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఐకూ 9 5జీ మోడల్ పై భారీగా ధరని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐకూ 9పై ఏకంగా రూ.12 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే రూ.49,990 ఎమ్మార్పీ ఉన్న ఫోన్ ని మీరు కేవలం రూ.37,990కే పొందవచ్చు. మీ వద్ద ఐసీసీఐ, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ కార్డులుంటే.. అదనంగా రూ.5 వేలు తగ్గింపు పొందవచ్చు.
అంటే మీకు ఐకూ9 ఫోన్ రూ.32,990కే లభిస్తుంది. అంటే ఓవరాల్ గా మీకు రూ.17 వేలు వరకు తగ్గింపు లభించినట్లు అవుతుంది. దీనికి ఎక్స్ ఛేంజ్ ఆఫర్ అదనంగా ఉంటుంది. మీకు ఫోన కండిషన్ ని బట్టి రూ.25 వేలు వరకు ఎక్స్ ఛేంజ్ ప్రైస్ లభిస్తుంది. ఇంక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. స్నాప్ డ్రాగన్ 888+ ప్రోసెసర్ తో వస్తోంది. 120 హెట్స్ 10 బిట్ ఆమోలెడ్ డిస్ ప్లే తో వస్తోంది. ఇందులో 48 ఎంపీ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంటెలిజెంట్ డిస్ ప్లే చిప్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 120 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తోంది. ఇది కేవలం 6 నిమిషాల్లోనే 50 శాతం ఫుల్ అవుతుంది. 8 జీబీ+ 128 జీబీతో వస్తోంది. ఇందులో 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ ఐకూ 9 ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.