స్మార్ట్ వాచెస్ వినియోగం బాగా పెరిగిపోయింది. డిమాండునకు తగినట్లుగానే స్మార్ట్ వాచెస్ తయారీ కూడా బాగా పెరిగింది. అయితే ఏ స్మార్ట్ వాచ్ బెటర్ అంటే చాలా మంది చెప్పలేకపోవచ్చు. స్మార్ట్ వాచ్ ధర మాత్రమే కాదు.. అందులో లభించే ఫీచర్స్ కూడా చాలా ముఖ్యం. అందుకే ఒక గ్యాడ్జెట్ కొనే ముందు దాని గురించి బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో ఫైర్ బోల్ట్ నుంచి ఒక స్మార్ట్ వాచ్ విడుదలైంది.
ఈ స్మార్ట్ యుగంలో ప్రజలు అన్నీ స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే వాచెస్ కూడా స్మార్ట్ వే చూస్ చేసుకుంటున్నారు. అందుకే మార్కెట్ లో స్మార్ట్ వాచెస్ కి డిమాండ్ బాగా పెరిగింది. డిమాండునకు తగినట్లుగా స్మార్ట్ వాచెస్ తయారు చేసే కంపెనీలు కూడా పెరిగిపోయాయి. అయితే ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా కూడా కొన్ని కంపెనీలకు చెందిన వాచెస్ ని మాత్రమే వినియోగదారులు ఇష్టపడుతున్నారు. వాటిలో ఫైర్ బోల్ట్ కంపెనీ కూడా ఒకటి. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి మరో సరికొత్త మోడల్ ఒకటి మార్కెట్ లోకి విడుదలైంది. ఆ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ ఏంటి? దాని ధర ఎంత? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఇండియాలో ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచెస్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే ఆ కంపెనీ నుంచి ఎన్నో స్మార్ట్ వాచెస్ రిలీజ్ అయ్యి వినియోగదారుల మన్ననలు పొందాయి. ఇప్పుడు మరో అద్భుతమైన స్మార్ట్ వాచ్ ఒకటి ఫైర్ బోల్ట్ కంపెనీ నుంచి విడుదలైంది. ఆ స్మార్ట్ వాచ్ మోడల్ పేరు టెర్మినేటర్. సోమవారం నుంచే ఈ వాచ్ అమ్మకాలు మొదలయ్యాయి. దీని ఎమ్మార్పీ రూ.18,999 కాగా లాంఛింగ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.1,999కే అందిస్తున్నారు. ఈ వాచ్ ని ఫైర్ బోల్ట్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో కొనుగోలు చేయచ్చు. స్ట్రైకర్ లో 1.99 ఇంచెస్ డిస్ ప్లే ఉంది. అంతేకాకుండా ఈ వాచ్ లో ఎన్నో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి.
ఈ 1.99 ఇంచెస్ స్మార్ట్ వాచ్ లో 240*283 రెజల్యూషన్, 32*37 డిస్ ప్లే ఏరియాతో వస్తోంది. ఈ వాచ్ లో 500 నిట్స్ బ్రైట్ నెస్ లభిస్తుంది. ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. మీరు వాచ్ లో ఉండే ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్ ద్వారా నేరుగా వాచ్ తోనే ఫోన్ మాట్లాడవచ్చు. దీనిలో డైల్ ప్యాడ్ కూడా ఉంటుంది. ఈ వాచ్ లో మీరు కాంటాక్ట్స్, కాల్ హిస్టరీని కూడా సింక్రనైజ్ చేయచ్చు. ఈ వాచ్ లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. ఓకే గూగుల్- సిరి వంటిని వాచ్ ద్వారానే ఉపయోగించచ్చు. దీనిలో 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ ని మానిటర్ చేస్తుంది. మీ నిద్ర సమయాన్ని కూడా ఈ వాచ్ లెక్కిస్తుంది. బ్రీత్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. దీనిలో ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఈ ఫైర్ బోల్ట్ టెర్మినేటర్ స్మార్ట్ వాచ్ లో ఇన్ బిల్ట్ గేమ్స్ ఈ వాచ్ లో ఉన్న మరో ప్రత్యేకత. మ్యూజిక్, కెమెరా కంట్రోల్, ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Fire-Boltt Terminator smartwatch is launching at ₹1,999 on March 6, 2023 in India.
– 1.99″ large HD display
– Bluetooth calling
– In-built speaker and mic
– 120+ sports mode, 100+ watch faces
– Heart rate, SpO2, sleep monitor, breath training
– In-built games
– Music, camera… https://t.co/3quMnENwMu pic.twitter.com/XzubyZYgZf— Oneily Gadget (@OneilyGadget) March 4, 2023