స్మార్ట్ వాచెస్ వాడకం బాగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. అందుకే చాలా కంపెనీలు ఈ స్మార్ట్ వాచెస్ ని తయారు చేసేందుకు ఇష్టపడతున్నాయి. అలా రోజుకొక కొత్త మోడల్, డిజైన్ అంటూ న్యూ స్మార్ట్ వాచెస్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.
స్మార్ట్ వాచ్ లను ఇష్టపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అందుకే ఉన్న డిమాండ్ ని అందిపుచ్చుకునేందుకు చాలా సంస్థలు సరికొత్త డిజైన్స్, మోడల్స్, ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను తయారు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు చాలా తక్కువ ధరకే మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లు తయారు చేస్తూ మధ్య తరగతి మార్కెట్ ని టార్గెట్ చేసి లాభాలు గడిస్తున్నారు. ఎన్ని స్మార్ట్ వాచెస్ వచ్చినా కూడా ఓల్డ్ మోడల్ వాచెస్ ని ఇష్టపడేవాళ్లు అలాగే ఉన్నారు. అందుకే అలాంటి వారికోసం కూడా స్మార్ట్ వాచెస్ స్ట్రాప్ లను పక్కన పెట్టి లెదర్ బెల్ట్, మెటల్ చైన్ వాచెస్ ని విడుదల చేస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ అచ్చు రోలెక్స్ వాచ్ ని పోలిన స్మార్ట్ వాచ్ ని విడుదల చేశారు.
స్మార్ట్ వాచెస్ కి సంబంధించి ఫైర్ బోల్ట్ కంపెనీ ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా తక్కువ సమయంలోనే వినియోగదారుల ఆదరణ పొందింది. అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్ వాచెస్ ని విడుదల చేస్తోంది. అయితే చైన్ వాచెస్ ఇష్టపడే వారికోసం ఫైర్ బోల్ట్ ఇప్పుడు ఓ ప్రీమియం వాచ్ ని విడుదల చేసింది. అయితే అది లుక్స్ కే ప్రీమియం గానీ, ధర విషయానికి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది. గతంలో ఇదే మోడల్ లో ఫైర్ బోల్ట్ నుంచి వచ్చిన క్వాంటమ్ వాచ్ కంటే కూడా తక్కువ ధరకి ఈ బ్లిజర్డ్ అనే మోడల్ ని తీసుకొచ్చింది. ఈ వాచ్ లుక్స్ విషయానికి వస్తే.. అచ్చు రోలెక్స్ వాచ్ మాదిరిగానే ఉంది.
Fire-Boltt BLIZZARD with 1.2-inch display, Ceramic body, 120 sports modes, Bluetooth calling, rotating crown, SpO2 monitoring, heart-rate monitoring launched in India at an introductory price of Rs. 3499.#FireBolttBlizzard pic.twitter.com/OrqJY2HXQr
— Mukul Sharma (@stufflistings) February 20, 2023
చైన్ వాచెస్ ఇష్టపడుతూ స్మార్ట్ వాచెస్ కు దూరంగా ఉంటున్న వాళ్లు.. ఈ బ్లిజర్డ్ వాచ్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇంక ఈ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. మూడు కలర్ వేరియంట్లలో ఈ వాచ్ అందుబాటులోకి వస్తోంది. గోల్డ్+ స్టీల్, బ్లాక్+ స్టీల్, ప్యూర్ స్టీల్ కలర్ లో ఈ వాచ్ వస్తోంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ, యాంటీ కోరిషన్, 220 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 7 డేస్ స్టాండ్, 120 స్పోర్ట్స్ మోడ్స్, వాయిస్ అసిస్టెంట్, ఐపీ67 వాటర్ రెసిస్టెంట్, 1.28 ఇంచెస్ డిస్ ప్లే, 2 బటన్ పుషర్స్, రొటేటింగ్ హెడ్, హై టెక్నాలజీ సెరామిక్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర విషయానికి వస్తే.. రూ.3,499కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 23 నుంచి ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్ సైట్ లో ఈ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయచ్చు.
Fire-Boltt Blizzard to be available for sale at ₹3,999 on February 23, 2023 in India.
– 1.28″ HD display
– Bluetooth calling
– 120 sports mode
– Heart rate, SpO2, sleep track
– In-built games
– 220mAh battery, 7 day battery*
– Camera control, tools#FireBoltt #FireBolttBlizzard pic.twitter.com/aCJylJqPux— Oneily Gadget (@OneilyGadget) February 18, 2023