ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ వాచెస్ ని వాడేస్తున్నారు. అందుకే చాలా కంపెనీలు స్మార్ట్ వాచెస్ తయారీని ప్రారంభించాయి. ఇప్పుడు ఫాస్ట్రాక్ కంపెనీ కూడా స్మార్ట్ వాచెస్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫాస్ట్రాక్ కంపెనీ అతి తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ ఒకటి విడుదలైంది.
సాధారణంగా వాచెస్ లో ఫాస్ట్రాక్ కు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, కార్యాలయాలకు వెళ్లే యువత ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వినియోగదారుల అభిరుచికి తగినట్లు ఫాస్ట్రాక్ నుంచి ఎన్నో మోడల్స్ మార్కెట్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు యువత అంతా స్మార్ట్ వాచెస్ కొనుగోలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకే ఫాస్ట్రాక్ కంపెనీ కూడా స్మార్ట్ వాచెస్ తయారీలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ఫాస్ట్రాక్ నుంచి కొన్ని స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. తాజాగా ఒక బడ్జెట్ స్మార్ట్ వాచ్ ని ఫాస్ట్రాక్ కంపెనీ ఇండియాలో లాంఛ్ చేసింది.
ఫాస్ట్రాక్ కంపెనీకి సాధారణ వాచెస్ కి ఎంతో గొప్ప మార్కెట్ ఉంది. ఇప్పుడు స్మార్ట్ వాచ్ మార్కెట్ ని హస్తగతం చేసుకునేందుకు ఫాస్ట్రాక్ సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. మామూలు వాచెస్ కంటే కూడా చాలా తక్కువ ధరలోనే స్మార్ట్ వాచెస్ ని తయారు చేసి విడుదల చేస్తోంది. భారత మార్కెట్ లో ఫాస్ట్రాక్ నుంచి ఇప్పటికే కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్‌ఎస్1 పేరిట కొత్త స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ధరని కేవలం రూ.1,695గా నిర్ణయించి అందరికీ షాకిచ్చారు. ఎందుకంటే చాలా బ్రాండ్స్ స్మార్ట్ వాచెస్ కంటే ఆ ధర చాలా తక్కువ. ఈ వాచ్ తో ఫాస్ట్రాక్ కంపెనీ ఎన్నో బ్రాండ్స్ కి గట్టి పోటీ ఇవ్వగలదు.
ఇంక ఈ ఫాస్ట్రాక్ ఎఫ్ఎస్1 రివోల్ట్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ వాచ్ 1.83 ఇంచెస్ అల్ట్రా వీయూ డిస్ ప్లేతో వస్తోంది. ఈ వాచ్ డిస్ ప్లే పెద్దగా ఉండటం వల్ల యూజర్ కు ఆపేరటింగ్ చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ఇందులో 2.5x నైట్రో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. కొన్ని నిమిషాల ఛార్జింగ్ తోనే రోజులపాటు ఈ వాచ్ ని వాడచ్చు. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 200కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. 24 గంటల స్ట్రెస్ మానిటరింగ్, హాట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, గ్రీన్, టీల్ అని నాలుగు విభిన్న కలర్స్ లో వస్తోంది. మార్చి 22 నుంచి ఈ ఫాస్ట్రాక్ ఎఫ్ఎస్1 స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.
Fastrack Revoltt FS1 launched in India for ₹1,695.#Fastrack pic.twitter.com/jTTEsxaLzi
— Mukul Sharma (@stufflistings) March 17, 2023