నీకు ఫేస్‌బుక్ అకౌంట్లు ఎన్నున్నాయ్ రా అంటే.. నాకు రెండు. మరి నీకు అంటే.. మూడు. అన్నెందుకురా అంటే.. ఫస్ట్ దాంట్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అలాంటప్పుడు ఏం పోస్టులు పెట్టలేం కదా.. అందుకే. మరి ఇంకో రెండు?.. కాలేజ్ ఫ్రెండ్స్ కోసం ఒకటి. కొత్త వారితో ఫ్రెండ్ షిప్ చేయడం కోసం ఇంకోకటి. ఇది అండి ప్రస్తుతం ఫేస్‌బుక్ వాడేవారు.. వారికున్న ఖాతాల సంఖ్య. ఇలాంటి భాధలు పడుతున్న వారికోసం ఫేస్‌బుక్ మాతృ సంస్థ ‘మెటా’ సరికొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఒకే అకౌంట్ పై మల్టిపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే ఫీచర్ దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఫేస్ బుక్ లో ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పీచర్ పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్లకు పరిచయం చేస్తామని వెల్లడించింది. “సోషల్ మీడియాలో తమకు నచ్చిన కంటెంట్ ను షేర్ చేయడంలో కొంత మంది యూజర్లు ఫ్రెండ్స్ జాబితాలో కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారనే కారణంతో సంకోచిస్తుంటారు. దీంతో అలాంటి అవసరాల కోసం వారు ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు ఉపయోగిస్తున్నారు. అలాంటి వారు ఒకే ఖాతాతో ఐదు వేర్వేరు ప్రొఫైల్స్ పెట్టుకునేలా కొత్త ఫీచర్ ను పరీక్షిస్తున్నాం” అని మెటా సంస్థ తెలిపింది.
ఈ ఫీచర్ లో యూజర్లు ఫేస్‌బుక్ ఖాతా ఏ పేరుతో క్రియేట్ చేశారో అదే ప్రైమరీ ప్రొపైల్ పేరుగా ఉంటుంది. మిగిలిన నాలుగు ప్రొఫైల్స్ కు యూజర్లు తమకు నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. అయితే వీటిలో కేవలం అక్షరాలు మాత్రమే ఉండాలి. నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు ఉండకూడదు. ఎవరైనా యూజర్ తమ అడిషనల్ ప్రొఫైల్స్ ఫేస్‌బుక్ పాలసీలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తిస్తే వారి ప్రొఫైల్స్ ను తొలగిస్తామని మెటా సంస్థ తెలిపింది. ఒక్కొక్కరికి మూడేసి.. నాలుగేసి అకౌంట్లు ఉండకుండా ఒకటే వాడేలా ఉండేదుకే.. ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
New: Facebook will start letting some users have up to 5 separate profiles all tied to one master account. Imagine a separate profile for friends, another for work, another for your gardening club, etc.
Just a test for now.
— Kurt Wagner (@KurtWagner8) July 14, 2022
ఇది కూడా చదవండి: Nokia: ఫోన్‌లోనే వైర్‌లెస్ ఇయర్ బడ్స్.. ‘నోకియా’ కొత్త టెక్నాలజీ!
ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై స్టేటస్ గా వాయిస్ నోట్స్!