సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కూడా ఇప్పుడు ట్విట్టర్ దారిలోకి వచ్చేశాయి. మెటా సంస్థ కూడా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్ట్ వెరిఫికేషన్ కోసం నెలవారీ చందాను ప్రవేశపెట్టింది. మరి.. దాని వల్ల లాభాలు ఏంటి? తీసుకోవడం ఉపయోగమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బ్లూ బ్యాడ్జ్ లేదా వెరిఫైడ్ అకౌంట్.. వీటి గురించి అందరికీ బాగా తెలుసు. గతంలో సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, ఫేమస్ పర్సనాలిటీస్ సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించేందుకు వాటిని వెరిఫై చేసి బ్లూ బ్యాడ్జ్ ఇచ్చే వాళ్లు. ఆ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న కంటెంట్ క్రియేటర్లకు కూడా బ్లూ బ్యాడ్జ్ ఇస్తూ వచ్చారు. నిజానికి నిన్న, మొన్నటి వరకు ఈ బ్లూ బ్యాడ్జ్ సర్వీస్ ఉచితంగానే ఉండేది. కానీ, ఎప్పుడైతే ట్విట్టర్ ని ఎలన్ మస్క్ కొనుగోలు చేశారో.. ఆ తర్వాత ట్విట్టర్ బ్లూ అని కొత్త పాలసీని తీసుకొచ్చారు. అంటే మీరు బ్లూ బ్యాడ్జ్ తీసుకోవాలి అన్నా, ఉన్న బ్లూ బ్యాడ్జ్ కొనసాగించాలి అన్నా నెలవారీ చందా కట్టి సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.
ఎలన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంపై మొదట్లో కాస్త వ్యతిరేకత వచ్చినా కూడా తర్వాత అందరూ వెరిఫైడ్ బ్యాడ్ట్ కోసం ట్విట్టర్ ని సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఇండియాలో కూడా ట్విట్టర్ బ్లూ సర్వీసెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అందుకు నెలకు రూ.900 వరకు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఎలన్ మస్క్ దారిలోకి మార్క్ జుకర్ బర్గ్ వచ్చారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్జ్ వెరిఫికేషన్ కోసం నెలవారీ చందాను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సర్వీస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రారంభిస్తున్నట్లు స్వయంగా జుకర్ బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే మిగిలిన దేశాల్లో కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
నెలకు ఆండ్రాయిడ్ యూజర్లకు 11.99(రూ.990) డాలర్లు, ఐవోఎస్ యూజర్లకు 14.99(రూ.1,240) డాలర్లు నెలవారీ చందా అని ప్రకటించింది. అయితే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఏంటంటే.. ఈ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్జ్ వల్ల లాభాలు ఏంటి? దాని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజానాలు పొందుతాము? అంటూ నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే మెటా సంస్థ బ్లూ బ్యాడ్జ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల కచ్చితంగా అదనపు ప్రయోజనాలు ఉండచ్చని టెక్ నిపుణులు కొందరు అభిప్రాయ పడుతున్నారు కూడా. వాళ్లు అలా ఎందుకు చెబుతున్నారో చూద్దాం.
నిజానికి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్జ్ తీసుకోవడం వల్ల యూజర్లకు.. మీకు వెరిఫైడ్ బ్యాడ్య్ వస్తుంది. మీ ఖాతా, మీ వ్యక్తిగత సమాచారానికి అదనపు భద్రత లభిస్తుంది. కస్టమర్ సర్వీస్ సేవలు కూడా మీకు మెరుగ్గా అందుతాయి. మీ ఖాతా ఎక్కువగా హైలెట్ కావడం, రీచ్ ఎక్కువ లభిస్తుంది. వేరే వాళ్లు ఎవరైనా మీ ఖాతాను తమదని లాగేసుకునే అవకాశం ఉండదు. సాధారణ యూజర్లతో పోలిస్తే.. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్న వాళ్లకి అదనపు ఫీచర్లను అందిస్తమాని చెప్పారు. ప్రభుత్వ గుర్తుపు కార్డుతో మీ ఖాతాని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో బ్లూ బ్యాడ్జ్ పొందిన వారికి వారి బ్యాడ్జ్ అలాగే ఉంటుంది. వాళ్లు నెలవారీ చందా కట్టాల్సి ఉంటుంది. కంటెంట్ క్రియేటర్లకు ఈ బ్లూబ్యాడ్జ్ సర్వీస్ పనికొస్తుందని చెబుతున్నారు. మరి.. మెటా సంస్థ బ్లూ బ్యాడ్జ్ వెరిఫికేషన్ పాలసీ తీసుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.