ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు ఎంతో మంది యూజర్లు ఉన్నారు. అయితే వాట్సాప్ సేఫ్టీ విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రశ్నలు, ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా దానిని ఎలన్ మస్క ట్వీట్ చేస్తూ వాట్సాప్ ని నమ్మొద్దంటూ చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా యూజర్లు కలిగిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఇలా ఏ అవసరం ఉన్నా స్మార్ట్ ఫోన్ యూజర్లు అంతా వాట్సాప్ నే వాడుతుంటారు. అయితే ఈ వాట్సాప్ డేటా సెక్యూరిటీ విషయంలో ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ బాహాటంగానే వాట్సాప్ సెక్యూరిటీపై నిందలు వేశారు. వాట్సాప్ లో మీ వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉండదని చెప్పారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎలన్ మస్క్ చేరాడు. వాట్సాప్ నమ్మొద్దని చెప్తున్నారు.
వాట్సాప్ సెక్యూరిటీ విషయంలో ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. యూజర్ డేటాకి వాట్సాప్ లో అసలు రక్షణ ఉండదని చెబుతుంటారు. అయితే వాట్సాప్ మాత్రం తమ వద్ద యూజర్ డేటాకి ఎంతో ప్రొటెక్షన్ ఉంటుందని చెబుతారు. ప్రతి చాట్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ తో ఉంటుందంటారు. పైగా మీ చాట్ ని వాట్సాప్ సంస్థ కూడా చూడలేదని చెబుతారు. కానీ, ఇప్పుడు నెట్టింట వాట్సాప్ పో మరో నింద పడింది. బ్యాక్ ఎండ్ లో వాట్సాప్ మైక్రోఫోన్ వాడుతుంటుందని ఆరోపించాడు. తాను నిద్రపోతున్న సమయంలో వాట్సాప్ యాక్టివిటీని స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశాడు.
WhatsApp has been using the microphone in the background, while I was asleep and since I woke up at 6AM (and that’s just a part of the timeline!) What’s going on? pic.twitter.com/pNIfe4VlHV
— Foad Dabiri (@foaddabiri) May 6, 2023
ఆ ట్వీట్ ని ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ రీట్వీట్ చేశారు. దానికి ఒక కోట్ యాడ్ చేశారు. “వాట్సాప్ నమ్మదగినది కాదు” అంటూ స్టేట్ మెంట్ పాస్ చేశారు. అయితే ఎలన్ మస్క్ వంటి వ్యక్తి ఇలా నేరుగా నమ్మెద్దని చెప్పడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మేము వాట్సాప్ ని అన్ ఇన్ స్టాల్ చేస్తున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎలన్ మస్క్ చేసిన ఈట్వీట్ కచ్చితంగా వాట్సాప్ సంస్థ తీరని నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు వాట్సాప్ సేఫ్టీ విషయంలో కొత్త అనుమానాలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఎలన్ మస్క్ ట్వీట్ పై వాట్సాప్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. వాట్సాప్ నమ్మదగినదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
WhatsApp cannot be trusted https://t.co/3gdNxZOLLy
— Elon Musk (@elonmusk) May 9, 2023