ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పాడు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాదిరే ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని ప్రకటించాడు. ఆ వివరాలు..
ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈవో అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు.. బ్లూ టిక్కు డబ్బులు చెల్లించాలనే నిబంధనను తెచ్చాడు. లోగో మార్చాడు. ఇక తాజాగా బ్లూ టిక్ తీసేసి సెలబ్రిటీలందరికి షాకిచ్చాడు. మస్క్ ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఏం బాంబు పేలుస్తాడో అన్నట్టు తయారయ్యాడు. అలాంటి మస్క్.. తాజాగా ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పాడు. దీని ప్రకారం ఇక ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని వెల్లడించాడు. ఆ వివరాలు..
కంటెంట్ క్రియేటర్లు.. ఇక మీదట యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే ట్విట్టర్లోనూ డబ్బులు సంపాదించుకోవచ్చు అని వెల్లడించాడు మస్క్. అందుకోసం మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రకటించాడు. ఎక్కువ సమాచారం నుంచి.. ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు.. దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌తో డబ్బు సంపాదించవచ్చని వెల్లడించాడు. ఇందుకోసం యూజర్లు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మానిటైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపాడు. అయితే ఈ ఆప్షన్ ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది మరిన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తుందని మస్క్ పేర్కొన్నాడు.
అయితే, ఈ ప్రయోజనాలు పొందాలంటే మాత్రం యూజర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందాల్సి ఉంటుంది. ట్విట్టర్లో షేర్ చేసే లాంగ్ఫామ్ కంటెంట్, ఇమేజ్‌లు, వీడియోలకు మాత్రమే సబ్స్క్రిప్షన్ పనిచేస్తుందని మస్క్ ప్రకటించాడు. ఇక యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి పోటీ సంస్థలతో పోలిస్తే ట్విట్టర్ ప్రస్తుతం పరిమితంగా మాత్రమే మానిటైజేషన్ ఆప్షన్లను అందిస్తోంది. ఈ క్రమంలో మస్క్ ఇచ్చిన ఆఫర్‌పై ట్విట్టర్ యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఎక్కువ మంది ట్విట్టర్ వినియోగించేలా చేయడం కోసం మస్క్ వేసిన వ్యూహం అని అంటున్నారు.
ఇక కంటెంట్ ద్వారా ట్విట్టర్ యూజర్లు సంపాదించిన డబ్బులో నుంచి మొదటి ఏడాది ట్విట్టర్ ఏమి తీసుకోదని మస్క్ తెలిపాడు. అంటే సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన మొత్తంలో గరిష్టంగా 70 శాతం వరకు యూజర్లకు అందజేస్తారు. అలా కాకుండా ట్విట్టర్ ద్వారా వచ్చిన డబ్బులో నుంచి మాత్రం ఐఓఎస్, ఆండ్రాయిడ్ 30 శాతం యాప్ స్టోర్ ఫీజు వసూలు చేస్తాయి. ఇక ట్విట్టర్ ద్వార డబ్బులు సంపాదించుకోవడమే కాక.. కంటెంట్ ప్రమోట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని తెలిపింది. మరి మస్క్ ఇచ్చిన ఆఫర్ మీకు నచ్చిందా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.