ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. త్వరగా సమాచారాన్ని చేరవేడానికి, సమాచారాన్ని పొందడానికి ఈ షార్ట్ బ్లాగ్ యాప్ ని వాడుతుంటారు. అయితే ఎలన్ మస్క్ ఈ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఈ సంస్థ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ట్విట్టర్ వెబ్ లోగోని మార్చి.. మస్క్ అందరికీ పెద్ద షాకే ఇచ్చారు.
ట్విట్టర్.. సోషల్ మీడియా మినీ బ్లాగ్ యాప్ ని కోట్ల మంది వాడుతున్నారు. తాము అనుకున్నది పరిమిత పదాలతో చెప్పేందుకు ఈ ప్లాట్ ఫామ్ తోడ్పడుతుంది. స్టార్లు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, సంస్థలు తమ అభిమానులు, ఫాలోవర్స్ కి సమాచారం చేరవేయడానికి కూడా ఈ ట్విట్టర్ ని వాడుతుంటారు. ప్రపంచ అబర కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి. ఉద్యోగుల తొలగింపు, కార్యాలయాల మూసివేత అంటా చాలానే జరిగాయి. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగోనే మారిపోయింది. అవును.. ఎలన్ మస్క్ ట్విట్టర్ లోగోనే మార్చేశారు.
సాధారణంగా ట్విట్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నీలి వర్ణంలో ఉన్న పక్షి బొమ్మ. అలాంటి ట్విట్టర్ వెబ్ లోగోని ఎలన్ మస్క్ డాజ్ కాయిన్ లోగోలో ఉండే షిబా ఇను అనే జపనీస్ టార్ఫ్ డాగ్ బ్రీడ్ మీమ్ కి మార్చేశాడు. డెస్త్ టాప్ లో ట్విట్టర్ ఓపెన్ చేసిన అందరికీ లోగో డాజ్ కాయిన్ మీమ్ డాగ్ ముఖమే కనిపిస్తుంది. అయితే ట్విట్టర్ యాప్ లోగో మాత్రం యథావిధిగా ఉంది. ఇది చూసి చాలా మంది షాకవుతున్నారు. అసలు ఎందుకు మస్క్ ఈ పని చేశారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. ఊరికే ఏం మస్క్ మార్చలేదు. అతను ఇచ్చిన మాట ప్రకారం ఈ పని చేశాడు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీ డాజ్ కాయిన్ కి హెల్ప్ చేయడం కోసం కూడా అని చెబుతున్నారు.
మార్చి 26, 2022లో మస్క్ ట్విట్టర్ వేదికగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీద నెట్టింట పెద్ద చర్చే జరిగింది. ఆ ట్వీట్ కు ది ఛైర్మన్ అనే అకౌంట్ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. నువ్వే ట్విట్టర్ ని కొనేసెయ్.. దాని లోగోని డాజ్ కాయిన్ మీమ్ డాగ్ కి మార్చేయ్ అంటూ ట్వీట్ చేశాడు. దానిని మస్క్ అది అంత బాగోదేమో అంటూ కామెంట్ చేశాడు. కానీ, అప్పటి స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ ‘మాటిచ్చినట్లుగానే చేశా’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా మస్క్ ఈ లోగో మార్చిన తర్వాత డాజ్ కాయిన్ సంస్థ విలువ అమాంతం పెరిగిపోయింది. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే అలా జరిగింది. అది కూడా మస్క్ లోగ మార్చిన తర్వాత. ఇది డాజ్ కాయిన్ క్రిప్టోకరెన్సీ సంస్థ సాయం చేయడానికి కూడా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ లోగో మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
As promised pic.twitter.com/Jc1TnAqxAV
— Elon Musk (@elonmusk) April 3, 2023