అకేషన్ ఏదైనా ఈ-కామర్స్ సైట్లు ఆఫర్లకు తెరతీయడం కామన్. ఫలానా ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్ల పేరిట వినియోగదారులను ఊరించే ప్రయత్నం చేస్తుంటాయి. సాధారణంగా ఈ సేల్స్ లో చాలా వరకు ఉత్పత్తులను తగ్గింపు ధరకే అందిస్తున్నా.. కొన్ని వస్తువులపై మాత్రం పెద్దగా తగ్గింపు ఉండదు. అందులోనూ.. ఆన్లైన్ లో షాపింగ్ అంటే ప్రమాదాలకు కూడా దగ్గరగా ఉన్నట్లే. ముఖ్యంగా ఈ-కామర్స్ సైట్ల ద్వారా షాపింగ్ చేసేటప్పుడు మోసాలు జరుగుతుంటాయి. కొంతమంది సెల్లర్స్ వినియోగదారులను మోసం చేయడానికి ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు. డూప్లికేట్ వస్తువులను అమ్మి భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తుంటారు. మరి ఇలాంటి మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండం అవసరం..
మీరు పలానా స్పెసిఫైడ్ ఈ- కామర్స్ సైట్ లో వస్తువుల్ని సెలక్ట్ చేసుకునే సమయంలో సెర్చ్ రిజల్ట్స్ లో చాలా కనిపిస్తాయి. కానీ అవన్నీ ఆయా సంస్థలు నేరుగా అమ్మేవి కావచ్చు.. కాకపోవచ్చు. కొన్ని థర్డ్ పార్టీ గూడ్స్ కూడా మనకు సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అందులో కొన్ని వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తుంటాయి. అందరిని ఆకర్షించే అంశం ఇదే. మోసాయి పోయేది ఇక్కడే. ఈ వస్తువులకు ఆయా సంస్థలదే బాధ్యత అయినప్పటికీ.. మీరు మోసపోకుండా ఉండాలంటే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. అలాగే.. ముందుగా ఫుల్ ఫిల్డ్ బై ఈ-కామర్స్ సైట్ లో చెక్ చేయాలి. దీని వల్ల మీకు థర్డ్ పార్టీ అమ్మే వస్తువులేవో తెలిపిపోతుంది.
మనుషులకు ఉన్న బలహీనత తక్కువ ధరకు ఏదైనా వస్తువు లభిస్తుందంటే కొనేయడమే. ఈ బలహీనతనే మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. మనం ఒక ఈ- కామర్స్ సైట్ ఓపెన్ చేసి ఫలానా ఫోన్ ధర ఎంత అని వెతికితే చాలు, పలు రకాలు దర్శనమిస్తాయి. అందులో తక్కువ ధరకు కూడా కొన్ని కనిపిస్తాయి. వాటన్నిటిని నమ్మకూడదు. నిజంగా ఆ వస్తువు ఆ ధరకు వస్తుందా లేదా అన్నది ఇతర సైట్ల ద్వారా చెక్ చేసుకోవాలి. అలాగే.. సదరు కంపెనీ వెబ్ సైట్ లో కూడా ఒకసారి చెక్ చేయడం మంచిది.
ఈ-కామర్స్ సైట్లలో కొన్ని వస్తువులు జస్ట్ లాంచ్డ్ అనే ట్యాగ్ తో కనిపిస్తుంటాయి. వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే స్కామర్స్ ఇలాంటి స్కీములతోనే జనాలను మాయ చేయాలని చూస్తుంటారు. సాధారణంగా క్వాలిటీ వస్తువులనే అమ్ముతారు. అలా అమ్మే సంస్థలకే అవకాశం ఇస్తారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంస్థలు ఫేక్ సర్టిఫికెట్లతో ఈ-కామర్స్ సైట్లలో అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా.. ఏదో ఒక రకంగా మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. కావున జస్ట్ లాంచ్డ్ ప్రొడక్ట్స్ తో జాగ్రత్తగా ఉండడం మంచింది.
ఉదాహరణకు.. Bisleri వాటర్ బాటిల్ అంటే అందరికి తెలుసు. కానీ, అదే పేరుతో Belsri, Bislleri, Bilseri, Bisleri, Brislei వంటి అనేక ఫేక్ వాటర్ బాటిల్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. దప్పికతో ఉన్నప్పుడు స్పెల్లింగ్ లు ఏం చూస్తారు.. కొనడం.. క్యాప్ ఓపెన్ చేయడం.. వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ మోసాల బారిన పడకుండా ఉండాలంటే మాత్రం కచ్చితంగా అలాంటి వాటిని గుర్తించాల్సిందే.
కొందరకి రివ్యూలను చదవడం పెద్ద చిరాకైన విషయం. ఎవరి అభిప్రాయం వాళ్లది లేదంటే సదరు కంపెనీకి చెందిన వారే మంచి రేటింగ్ ఇచ్చింటారేమో అని అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి అనుమానాలు మీ మనుసులో ఎన్ని ఉన్నా కొనేముందు రివ్యూలను చదవటం అనేది ఉత్తమ పద్ధతి. ఎందుకంటే అప్పటికే ఆ ప్రొడక్ట్ వాడిన వారు ఆ వస్తువుఫై అభిప్రాయాలను, రేటింగ్ ఇస్తారు. రేటింగ్ బాగుంటేనే మనం వస్తువు కొనుక్కోవొచ్చు. ఇలా కొన్ని చిట్కాల ద్వారా ఈ- కామర్స్ సైట్ల మోసాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ చిట్కాలు.. ఉపయోగకరమైనవేనా..! మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.