దేశంలో సోషల్ మీడియా వినియోగం ఇంతలా పెరగడానికి ముఖ్య కారణం.. అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్ చవగ్గా లభించడం. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు రోజులో ఎంతో కొంత సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఇక మరి కొందరైతే బానిసలుగా మారారు. ఇక సోషల్ మీడియా వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. కొందరికి సోషల్ మీడియా వ్యసనంగా మారింది. మరికొందరు దీని ద్వారానే భారీ ఎత్తున ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు చాలా మంది దీన్ని వినియోగిస్తుంటారు. ఇక యూజర్లను ఆకర్షించేందుకు ఇన్‌స్టాగ్రామ్ నిత్యం రకరకాల కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఇవన్ని బాగానే ఉన్నప్పటికి అప్పుడప్పుడు సోషల్ మీడియా వినియోగంతో కొన్ని అనుకొని అవాంతరాలు ఏర్పడతాయి. ఇక తాజాగా బుధవారం రాత్రి నుంచి ఇన్‌స్టా యూజర్లు.. తెగ ఇబ్బంది పడ్డారు. వారి అకౌంట్లో అనే హ్యాష్‌ట్యాగ్‌ని #Embeded సర్చ్ చేస్తే.. ఆటోమెటిగ్గా లాగవుట్ అయ్యింది. అసలు ఎందుకిలా జరిగిందో అర్థం కాక యూజర్లు ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుందో లేదో తెలియదు. ఎందుకైనా మంచిది మీరు మీ ఇన్‌స్టా అకౌంట్లో #Embeded హ్యాష్‌ట్యాగ్‌ను మాత్రం సర్చ్ చేయకండి.