ఎండైనా, వానైనా కొందరికి ఫ్యాన్, కూలర్, ఏసీలు అలవాటు అయిపోతాయి. అవి లేకపోతే వారికి పూట గడవదు. కానీ ప్రతి చోటుకి ఏసీని, కూలర్ ని తీసుకెళ్లాలి అంటే అవ్వదు. అందుకే ఇప్పుుడు మీకోసం ఒక పోర్టబుల్ ఏసీ గురించి తీసుకొచ్చాం. అసలు ఎలా పని చేస్తుంది? దాని వల్ల నిజంగానే ఉపయోగం ఉందా? చూద్దాం.
మనిషి జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు, ఆనందంగా గడిపేందుకు ఎన్నో రకాల ఉత్పత్తులను తీసుకొస్తుంటారు. నిజానికి చాలా గ్యాడ్జెట్స్ వల్ల మనిషి లైఫే చాలా ఈజీ అయిపోయింది. ఎలాంటి ఇబ్బంది, కష్టం లేకుండా కాలం గడిపేస్తున్నారు. ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్, డెస్క్ లో కూర్చుని ఎక్కువ సమయం పనిచేయడం చేస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన గ్యాడ్జెట్ ని తీసుకొచ్చారు. ఇది మీ దగ్గర ఉంటే ఎండ, చెమట అనేవి దరి చేరవు. మీరు దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. ముఖ్యంగా సిస్టమ్ వర్క్ చేసే వారికోసం డిజైన్ చేశారు. వారు అయితే ఎంచక్కా సిస్టమ్ పక్కన పెట్టుకుని మండే ఎండలు తమ దరి చేరకుండా కూల్ అయిపోవచ్చు.
ఈ హ్యాండ్ ఏసీని వాసుకీ అనే బ్రాండ్ వాళ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిని పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ గా చెబుతున్నారు. కానీ, ఫీల్ మాత్రం ఏసీకి ఏమాత్రం తీసిపోదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా ఇది రూ.6,49కే దొరకడం ఇంకా మంచి విషయం. ఈ గ్యాడ్జెట్ విషయానికి వస్తే.. దీనికి టాప్ లో ఒక ట్యాంక్ ఉంటుంది. దానిలో 600 ఎంఎల్ వాటర్ పోయచ్చు. దానికి స్పిల్ కాకుండా రబ్బర్ సీల్ ఉంటుంది. ఇందులో ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్, మిస్ట్ కంట్రోల్ బటన్ ఉంటుంది. మీరు కావాలంటే సాధారణ ఫ్యాన్ గా వాడుకోవచ్చు. కావాలంటే మిస్ట్ బటన్ నొక్కితే మీకు చల్లని గాలి వస్తుంది. అయితే ఇది పొగలా కనిపిస్తుంది. ఎలాంటి నీటి తుంపర్లు వంటివి ఏమీ పడవు. ఇందులో లైట్, అలారమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీనికి టైప్ సీ పిన్ కనెక్ట్ చేసే ఉంచాలి. ఎక్కడికన్నా వెళ్లాలి అంటే పవర్ బ్యాంక్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ AC కొనుగోలు చేసందుకు క్లిక్ చేయండి.