కరోనా వచ్చిన తర్వాత మానవ జీవితాలు దాదాపుగా తారుమారు అయ్యాయనే చెప్పాలి. అప్పటివరకు లేనివి చాలానే జరిగాయి. వాటిలో పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి చూశారు. ఆ సమయంలో అందరూ ఇంటి నుంచే పని చేశారు. పిల్లలు కూడా ఇంట్లో ఉండే ఆన్ లైన్ క్లాసుల ద్వారా చదువుకున్నారు. ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫార్ములానే వాడుతున్నాయి. అయితే ఈ సమయంలో గంటల కొద్దీ సిస్టమ్ ముందు కూర్చుని పిల్లలు, పెద్దలు చాలా విసిగిపోతారు. అలా కళ్లు తిప్పినా ఎక్కడ కోప్పడతారో అని కూర్చుండిపోయేవారు. కానీ, ఈ సాఫ్ట్ వేర్ తో ఆ బాధ తప్పుతుంది. అవును.. ఆ వివరాలేంటో చూద్దాం.
రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రాముఖ్యత ఎంత పెరిగిపోనుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ సాఫ్ట్ వేర్లు సంచలనం అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి ఒక టెక్నాలజీతో పనిచేసే సాఫ్ట్ వేర్ ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసుల వారి కష్టాలు తీర్చబోతోంది అని చెబుతున్నారు. అవును ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీరు ఆన్ లైన్ క్లాస్, జూమ్ కాల్స్ కూర్చొని ఎటు చూసినా కూడా మీరు కెమెరా కల్లే చూసినట్లే ఉంటుంది. అవతలి వ్యక్తి ఎలాంటి అనుమానం కూడా రాదు. ప్రస్తుతం టెక్ నిపుణులు అంతా ఈ సాఫ్ట్ వేర్ గురించే తెగ చర్చిస్తున్నారు.
ఈ తరహా సాఫ్ట్ వేర్లు చాలానే ఉన్నాయి. వాటిలో నివిడియా బ్రాడ్కాస్ట్ అనే సాఫ్ట్ వేర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీని ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్ లను ఏఐ టెక్నాలజీతో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ని ఫ్రీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఆ సాఫ్ట్ వేర్ ని జూమ్, గూగుల్ మీట్ వంటి ఏ వీడియో సపోర్ట్ సాఫ్ట్ వేర్ లో అయినా కూడా వాడుకోవచ్చు. దానిలో యాడ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో బ్యాగ్రౌండ్ బ్లర్, బ్యాగ్రౌండ్ రీప్లేస్మెంట్, ఫాలో ఆన్ కెమెరా, వీడియో నాయిస్ రిమూవల్ బేటా, ఐ కాంటాక్ట్ బేటా, విగ్నెట్ వంటి ఎనో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
వాటన్నింటిలో ఐ కాంటాక్ట్ అనే ఫీచర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ లలో మీరు కెమెరా చూడకపోయినా కూడా చూసినట్లే ఉంటుంది. అందుకు ఐ కాంటాక్ట్ అనే ఎఫెక్ట్ ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. జూమ్ లోకి వెళ్లి మీ కెమెరా ప్రిఫరెన్స్ ని నివిడియా బ్రాడ్ కాస్ట్ కెమెరాకి మార్చుకోవాలి. అలా చేసిన తర్వాత మీరు తల తిప్పకుండా ఎటువైపు చూసినా కూడా మీరు కెమెరానే చూస్తున్నట్లు బ్రమింపచేస్తుంది. ఆన్ లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్స్, ఆన్ లైన్ ఎగ్జామ్స్ కి కూడా ఈ యాప్ ని వనియోగించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.