చాట్ జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. కేవలం ప్రారంభమైన రెండు నెలలలోనే 100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. చాట్ జీపీటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి దీని వల్ల యూజర్లకు లక్షల్లో డబ్బులు కూడా రాబోతున్నాయి.
చాట్ జీపీటీ.. ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి తెలుసు. కేవలం రుండ నెలల్లోనే వంద కోట్ల యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత అది ఏం చేసినా అదొక అద్భుతం అయిపోయింది. ఓపెన్ ఏఐ సృష్టించిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ చాట్ బాట్ ఇంక్లూడ్ చేస్తూ తమ సరికొత్త బింగ్ ని లాంఛ్ చేసింది. ఈ ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఒక బంపరాఫర్ ఇస్తోంది. అదేంటంటే.. చాట్ జీపీటీతో మీరు రూ.16 లక్షలు గెలుచుకోవచ్చు. ఆ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా చెప్పింది.
చాట్ జీపీటీ అంటే ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్న టాపిక్. చాట్ జీపీటీ వల్ల లాభాలు ఉన్నాయని కొందరు, దీని వల్ల మనుషుల ఉద్యోగాలు పోతాయంటూ ఇంకొందరు, దీని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. వాదనలు ఏవైనా చాట్ జీపీటీ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా చాట్ జీపీటీ సంస్థ ఒక బంపరాఫర్ ప్రకటించింది. మీకు చాట్ జీపీటీ ద్వారా రూ.16 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ చాట్ జీపీటీ మీద ఇప్పటికే ఎన్నో టెస్టులు జరిగాయి. అయినా ఎప్పుడూ ఏదోక తప్ దొర్లుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటివి రాకూడదని భావించారో ఏమో.. ఒక బౌంటీ కాంటెస్ట్ ని ప్రారంభించారు.
చాట్ జీపీటీలో బగ్స్ కనిపెట్టే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్ కి ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. ఎవరైనా చాట్ జీపీటీలో బగ్ ని కనిపెడితే.. దాని స్థాయిని బట్టి మీకు 200 డాలర్ల నుంచి 20 వేల డాలర్ల వరకు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఇలాంటి బగ్స్ కనిపెట్టడం అంత తేలికైన పని కాదని చెబుతున్నారు. మీరు గుర్తించిన సమస్యను కంపెనీ పరిష్కరిస్తుంది. ఇలాంటి వాటి ద్వారా కంపెనీకి సమయం, శ్రమ కలిసొస్తాయి. పైగా బగ్స్ ఉండే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు చాట్ జీపీటీ మీద ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత కూడా ఉంది. దినిలో యూజర్ డేటాకు భద్రత లేదని వాదిస్తున్నారు. అలాగే దీని వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉందని.. దీనిని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.