ప్రస్తుతం మార్కెట్‌లో ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు జోరుగా ప్రకటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో రియల్ మీ కంపెనీకి మంచి పేరుంది. అతి తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తుందని టెక్ నిపుణులు సైతం కితాబులు ఇస్తూ ఉంటారు. అలాంటి రియల్ మీ కంపెనీ ఇప్పుడు దీపావళి సేల్ నిర్వహిస్తోంది. తమ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు ఇవ్వడమే కాకుండా కొన్ని బ్యాంకులతో కలిసి అదనపు డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. ముఖ్యంగా 5జీ స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అసలు ఆఫర్లు ఏంటి? ఎంత డిస్కౌంట్లు లభిస్తున్నాయో చూద్దాం.
రియల్‌మీ 5జీ స్మార్ట్ ఫోన్లలో రియల్‌మీ నార్జో 50ప్రో 5జీ ఫోన్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ నార్జో 50ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ఎమ్మార్పీ రూ.25,999 కాగా ఆఫర్లలో కేవలం రూ.17,999కే అందిస్తోంది. మొత్తం మీద డైరెక్ట్ పర్చేస్‌లో 31 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా.. సిటీ, ఐసీఐసీఐ, కోటక్, రూపే క్రెడిట్/డెబిట్ కార్డులపై ఫ్లాట్ రూ.వెయ్యి డిస్కౌంట్‌ని కూడా ప్రకటించింది. అంటే ఫోన్‌ని రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ రియల్‌మీ నార్జో 50ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీనిని రూ.17 వేల వరకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. మీ దగ్గర దాదాపు ఒక సంవత్సరం పాత ఫోన్ ఉంటే దానిపై దాదాపుగా రూ.9 వేల వరకు ఆఫర్ ఉంది. అంటే అప్పుడు ఫోన్‌ని రూ.8 వేలకే పొందే అవకాశం ఉంది.
అయితే రియల్ మీ నార్జో 50ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఒకటి 6జీబీ ర్యారమ్+128జీబీ స్టోరేజ్‌తో లభిస్తోంది. దీని ధర రూ.17,999గా ఉంది. ఇంకో వేరియంట్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. దాని ధర రూ.27,999కాగా రూ.23,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్‌సిటీ 920 5జీ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. 6.4 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 90గిగాహెట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48ఎంపీ ఏఐ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో తీసుకొచ్చారు. ఈ దీపావళికి రియల్‌మీ అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది అంటూ టెక్ నిపుణులు సైతం చెబుతున్నారు.
Make it #realMeDiwali and dominate your game with the #realmeNarzo series starting at ₹5,749* with @amazonIN’s #AmazonGreatIndianFestival.
*T&C Apply
Buy now: https://t.co/ib6x04YVC5 pic.twitter.com/9sUJ4kd6SQ
— realme (@realmeIndia) October 19, 2022