ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అనగానే అందరూ.. చాట్ జీపీటీ అంటారు. అయితే చాట్ జీపీటీ కాకుండా ఏఐలో చాలా రకాల టూల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ గూగుల్ ఏఐ ఎక్స్ టెన్షన్స్ మీకోసం తీసుకొచ్చాం. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకు యూజ్ అవుతాయో తెలుసుకోండి.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో చాట్ జీపీటీ ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ ఏఐ చాట్ బాట్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏఐలో చాట్ జీపీటీ ప్రాభవం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. జనాల్లో ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ అనగానే చాట్ జీపీటీనే గుర్తొచ్చేలా పాపులర్ అయింది. కానీ, చాలా మందికి తెలియక పోవచ్చు. చాట్ జీపీటీ కంటే కూడా మంచి మంచి వెబ్ సైట్స్ చాలా ఉన్నాయి. అవి మీ పనిభారాన్ని కూడా తగ్గించగలవు. ఎంత అంటే మీరు గంటలు చేయాల్సిన పనిని అవి నిమిషాల్లో చేసేస్తాయి. మరి.. ఆ వెబ్ సైట్లు ఏంటి? అవి ఎలా మీకు ఉపయోగపడతాయో తెలుసుకోండి.
సై స్పేస్ అనేది యూజర్ గంటల్లో చేయగల పనిని నిమిషాల్లో చేస్తుంది. ముఖ్యంగా రీసెర్చ్ పేపర్ల కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇది చదువుతుంది, అర్థం చేసుకుంటుంది, మీరు వివరణ కూడా ఇస్తుంది. ఎలాంటి రీసెర్చ్ పేపర్ ని అయినా ఇందులో అప్ లోడ్ చేసి డీకోడ్ చేయచ్చు. మీకు కావాల్సిన మేటర్ సెలక్ట్ చేసుకుని సెర్చ్ చేస్తే అందుకు సంబంధించిన వివరణను ఈ సైస్పేస్ కోపిలోట్ ఇస్తుంది. మ్యాథ్స్ ఈక్వేషన్స్, టేబుల్స్ ని కూడా ఇది అర్థం చేసుకోగలదు. పూర్తి టెక్ట్స్ కాంటెక్ట్స్ లో వివరాలు వస్తాయి. మీరు ఫాలోఅప్ క్వెరీస్ కూడా చేయచ్చు. ఏ భాషలో అయినా మీరు సెర్చ్ చేయచ్చు. అంతేకాకుండా మీ రీసెర్చ్ పేపర్స్ కి రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ ని కూడా చూడచ్చు. ఈ సై స్పేస్ వెబ్ సైట్ చూసేందుకు క్లిక్ చేయండి.
ఈ వెబ్ సైట్ ఆఫీస్ కు సంబంధించి గ్రూప్ కాల్స్, గ్రూప్ మీటింగ్స్ లో పాల్గొనే వారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫైర్ ఫ్లైస్ వెబ్ సైట్ ద్వారా మీరు మీ మీటింగ్స్ ని ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ ఫార్మాట్ లోకి పొందచ్చు. మీరు మాట్లాడిన అన్ని విషయాలు స్క్రిప్ట్ రూపంలోకి వస్తాయి. మీరు గూగుల్ మీట్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ పని జరిగిపోతుంది. మీ మీటింగ్ మొత్తం స్క్రిప్ట్ రూపంలోకి వస్తుంది. ఈ ఫైర్ ఫ్లైస్ వెబ్ సైట్ విజిట్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ప్రాంప్ట్ బాక్స్ ద్వారా మీరు మీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో చేసిన అన్ని వర్క్స్ ని దీనిలో సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేయచ్చు, అంతేకాకుండా మీ వర్క్ మొత్తాన్ని ఒకే దగ్గర సేవ్ చేసకుని దానిని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాందడోయ్.. మీ ప్రాంప్ట్ బాక్స్ లో ఉన్న వర్క్ చూసేందుకు మీరు వన్ టైమ్ ఛార్జ్ కూడా చేయచ్చు. ఒకే స్క్రిప్ట్, ఒకే విషయాన్ని పదే పదే టైప్ చేసే అవసరం లేకుండా దీనిని వాడుకోవచ్చు. ప్రాంప్ట్ బాక్స్ వెబ్ సైట్ విజిట్ చేసేందుకు క్లిక్ చేయండి.
యూజ్ చాట్ జీపీటీ ద్వారా మీరు ఎలాంటి టెక్ట్స్ ని అయినా కాపీ చేసుకోవచ్చు. మీరు రాసిన సబ్జెక్ట్ ని రీఫ్రేజ్, సమరైజ్, ట్రాన్స్ లేట్, ఎక్స్ ప్లైన్ చేయచ్చు. అలాగే ఏ వెబ్ సైట్ కి అయినా ఏ టెక్ట్స్ కి అయినా కాపీ పేస్ట్ లేకుండా రిప్లై ఇవ్వచ్చు. దీనితో మీ రైటింగ్ ఎబిలిటీ, బ్రౌజింగ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ యూజ్ చాట్ జీపీటీ వెబ్ సైట్ విజిట్ చేసేందుకు క్లిక్ చేయండి.
యాడ్ కాపీ ఏఐ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ద్వారా మీరు యాడ్స్ ని క్రియేట్ చేయచ్చు. మీకు కావాల్సిన ప్రొడక్ట్ కి కావాల్సిన విధంగా ఫేస్ బుక్ యాడ్ రెడీ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ వివరాలు, కాన్సెప్ట్ ని ఎంటర్ చేస్తే మీకు కావాల్సిన విధంగా యాడ్ ని తయారు చేసుకోవచ్చు. ఈ యాడ్ కాపీ ఎక్స్ టెన్షన్ ని విజిట్ చేసేందుకు క్లిక్ చేయండి.
చాట్ జీపీటీ పవర్డ్ మోనికా ఏఐ సిస్టమ్.. చాట్ జీపీటీ ప్లస్ స్థాయిలో ఎంతో వేగంగా పనిచేస్తుంది. మీకు కావాల్సిన సమాచారాన్ని రీవ్రైట్ చేయడం, ట్రాన్స్ లేట్ చేయడం, 80కి పైగా టెంప్లేట్స్ సాయంతో మీకు కావాల్సిన విధంగా కంటెంట్ ని రాస్తుంది. మోనికా ఏఐ గూగుల్ ఎక్స్ టెన్షన్ ని ట్రై చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎక్స్ ప్లోర్ చేసేందుకు.. కంటెంట్ చదువుకు ఉపయోగపడే చాట్ జీపీటీ అసిస్టెంట్ సిస్టమ్. దీని ద్వారా మీకు కావాల్సిన రిలైబుల్, యాక్యురేట్ కంటెంట్ ని పొందచ్చు. ఈ వైజ్ వన్ వెబ్ సైట్ విజిట్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ కంపోజ్ ఏఐ ఎక్స్ టెన్షన్ సాయంతో మీరు కంటెంట్ రాయచ్చు. అది కూడా మీ రైటింగ్ సమయాన్ని 40 శాతం ఆదా చేసుకోవచ్చు. మీరు కొంత టాపిక్ ని ఇస్తే ఈ ఏఐ సిస్టమ్ మీకు కావాల్సిన విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. దీనితో మీకు కావాల్సిన విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కంపోజ్ ఏఐ విజిట్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ పెర్ ప్లెక్సిటీ ఏఐ ఎక్స్ టెన్షన్ ద్వారా మీకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానాలు మాత్రమే కాకుండా సోర్సెస్ కూడా చూపిస్తుంది. ఈ పెర్ ప్లెక్సిటీ ఎక్స్ టెన్షన్ విజిట్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఇది చాట్ జీపీటీకి బ్రౌజర్ ఎక్స్ టెన్షన్. దీని ద్వారా మీరు ఎలాంటి కంటెంట్ ని అయినా తయారు చేయచ్చు. మీకు కావాల్సిన కంటెంట్ కి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలో తెలియజేస్తే.. అందుకు తగిన విధంగా కంటెంట్ క్రియేట్ అవుతుంది. ఈ అలిసెంట్ ఎక్స్ టెన్షన్ ట్రై చేసేందుకు క్లిక్ చేయండి.