పెరుగుతున్న టెక్నాలజీతో ఎవరి వ్యక్తిగత సమాచారం అంత భద్రం కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా రకాల హ్యాక్ లు, సైబర్ అటాక్స్ గురించి విన్నాం. అయితే ఇలాంటి అటాక్స్ విషయంలో ఐఫోన్లు చాలా భద్రంగా ఉంటాయని చెబుతుంటారు. కానీ, ఒక నివేదిక మాత్రం ఐఫోన్లే లక్ష్యంగా ఒక సైబర్ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం సైబర్ అటాక్, హ్యాకింగ్ అనే పదాలు బాగా వినిపిస్తున్నాయి. చాలా ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత డేటా చోరీ చేశారు అంటూ వార్తలు చాలానే విని ఉంటారు. అందుకే సెలబ్రిటీలు, అధికారులు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఐఫోన్లు వాడుతుంటారు. ఎందుకంటే ఐఫోన్లు చాలా సేఫ్ అని అందరి నమ్మకం. వాటిని హ్యాక్ చేయడం అంత ఈజీ కూడా కాదు. కానీ, ఇప్పుడు వెలువడిన ఒక నివేదిక అందరినీ ఆశ్చర్యానికి.. ఒకింత భయానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఐఫోన్లు కూడా పెగాసెస్ తరహా స్పై వేర్ అటాక్ కు గురయ్యాయంటూ ఆ రిపోర్టు చెబుతోంది. ఈ నివేదిక చూసిన ఎంతోమంది ప్రముఖులు షాకవుతున్నారు.
ఐఫోన్లు హ్యాక్ అయ్యాయనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది కూడా సాధారణ ప్రజలు కాదు.. రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఐఫోన్లు హ్యాక్ గురయ్యాయంటూ వచ్చిన వార్త కలకలం రేపుతోంది. పెగాసస్ తరహా మాల్ వేర్ అటాక్ కు గురైనట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. క్వాడ్రీమ్ స్పైవేర్ ద్వారా ఈ అటాక్ చేసినట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటిలిజెన్స్ అనలిస్టులు గుర్తించారు. వీరు ముఖ్యంగా యాపిల్ ఐఫోన్లే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు చెబుతున్నారు. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఈ అటాక్ కి గురైనట్లు వెల్లడించారు.
ఐఫోన్లలో 14.4, 14.4.2 ఐవోఎస్ వర్షన్స్ ని టార్గెట్ చేసుకుని ఈ సైబర్ అటాక్ చేసినట్లు తెలియజేశారు. ఈ దాడితో మళ్లీ ప్రజల్లో పెగాసెస్ తరహా సైబర్ అటాక్ భయాలు వెలుగు చూశాయి. మిడిల్ ఏషియా, నార్త్ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ లలో బాధితులను గుర్తిచారు. ఈ క్వాడ్రీమ్ సర్వర్లు అన్నీ మెక్సికో, రొమేనియా, సింగపూర్, ఇజ్రాయెల్, హంగేరి, ఘనా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, యూఏఈ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మీరు ఏదైనా లింక్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. కానీ, ఇక్కడ అలాంటిది జరగలేదని తెలుస్తోంది. మీరు ఎలాంటి ఫిషింగ్ లింక్స్ మీద క్లిక్ చేయకుండానే మీ ఫోన్ హ్యాక్ కావడం జరుగుతుంది. ఈ రకం సైబర్ దాడిని “ENDOFDAYS”, జీరో క్లిక్ అటాక్ అంటారని చెబుతున్నారు.
అయితే పెగాసస్ సమయంలో యాపిల్ సంస్థ ఐఫోన్ల కోసం ఒక కొత్త సేఫ్టీ టూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇమేజింగ్ అంటూ పెగాసస్ స్పై వేర్ గుర్తించే ఒక టూల్ ని తీసుకొచ్చింది. ఆ టూల్ ఐఫోన్ బ్యాకప్, ఇతర ఫైల్స్ ని చెక్ చేసి స్పై వేర్ ఉందా? లేదా అనే విషయాన్ని గుర్తిస్తుందని చెప్పారు. అయితే మరి ఇమేజింగ్ టూల్ ఈ మాల్వేర్ ని కనిపెట్టలేకపోయిందా? అసలు నిజంగానే ఇలాంటి ఒక దాడి జరిగిందా? మరి ఐఫోన్ ఈ దాడిపై ఎలా స్పందిస్తుంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సైబర్ అటాక్స్ జరగకుండా ఉండేందుకే సెల్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకొస్తూ ఉంటారు. కానీ, చాలామంది మాత్రం కొత్త వర్షన్ ని అప్ డేట్ చేసుకోకుండా పాత్ వర్షన్స్ నే వాడుతుంటారు. అలాంటి ఫోన్లు సైబర్ అటాక్ చేసేందుకు ఎంతో వీలుగా ఉంటాయి.