Vivo V25 Pro: ఊసరవెల్లిలా రంగులు మారే ఫోనేంటి? అని ఆశ్యర్యపోతున్నారా! అవును మీరు చదివింది నిజమే. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ అచ్చం ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. కలర్ ఛేజింగ్ బ్యాక్ ప్యానల్ స్మార్ట్‌ఫోన్ వివో వీ25 ప్రో మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ సపోర్ట్ కూడా అందించారు. నిత్యము బ్యాక్ ప్యానెల్ చేంజ్ చేయాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్.
వివో వీ25 ప్రో ధర, ఆఫర్:
రెండు వేరియంట్లలో వివో వీ25 ప్రో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ (8జీబీ + 128జీబీ) స్టోరేజ్ ధర రూ.35,999 కాగా, 12 జీబీ + 256జీబీ) స్టోరేజ్ ధర రూ.39,999గా ఉంది. గతంలో ఈ ఫోన్ ధర రూ.40 వేల నుంచి ప్రారంభం కానుందని వార్తలొచ్చాయి. అయితే.. అంతకంటే తక్కువ ధరకే లాంచ్ అవ్వడం విశేషం. ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్యూర్ బ్లాక్, సెయిలింగ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,500 తక్షణ డిస్కౌంట్ లభించనుంది.
స్పెసిఫికేషన్స్:
ఆగస్టు 25 నుంచి ఈఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఈరోజు నుంచే ప్రీ-బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Join us as we take you through a journey of a few friends reuniting to reminisce and create magical new memories with the all-new vivo V25 Pro.
Pre-book Now: https://t.co/GfemC1lJJs#MagicalPhone #DelightEveryMoment #vivoV25Pro #V25Series #MagicalNights pic.twitter.com/6ENOyFawh2
— Vivo India (@Vivo_India) August 17, 2022