ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘5జీ‘. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతోంది. 1జీ నుండి 5జీ వరకు ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. మొదట 1జీ లో కాల్స్ మాత్రమే చేసుకునే మనం.. 2జీ లో కాల్స్ అండ్ మెసేజ్ లు, 3జీ లో ఇంటర్నెట్, వైఫై బ్లూటూత్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న 4జీ టెక్నాలజీ, 3జీ కంటే 7 నుండి 8 రెట్లు వేగవంతంగా పనిచేస్తుంది. ఇక మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న 5జీ టెక్నాలజీ, 4జీ కంటే పది రెట్లు ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తుందని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో అందరూ 5జీ టెక్నాలజీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు కొనాలని చూస్తున్నారు. ఈ క్రమంలో 5జీ టెక్నాలజీ ఉన్న.. చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ మనముందుకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.
అన్ని కంపెనీల కంటే తక్కువ ధరలో ‘5జీ స్మార్ట్‌ఫోన్’ లాంచ్ చేస్తామని ప్రకటించిన ‘పోకో’ కంపెనీ.. చెప్పినట్లుగానే తక్కువ బడ్జెట్ లో పోకో ఎం4 5జీ సిరీస్ లాంచ్ చేసింది. గత వారం భారత్‌లో విడుదలైన ఈ బడ్జెట్ మొబైల్ గురువారం నుంచి(మే 5) ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: 7,499కే 6GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో కొత్త మొబైల్!
పోకో ఎం4 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.12,999, 6జీబీ + 128జీబీ టాప్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. SBI క్రెడిట్ కార్డుతో ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.1,250 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్‌ను రూ.11,749కే కొనుగోలు చేయవచ్చు. పోకో ఎల్లో, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంది.
POCO M4 5G live images.#POCO #POCOM4 #POCOM45G pic.twitter.com/M3plGmzQiX
— Mukul Sharma (@stufflistings) April 27, 2022
పోకో ఎం4 5జీ స్పెసిఫికేషన్స్
POCO M4 5G launched in India with MediaTek Dimensity 700, 5000mAh | price in India, specifications#POCOM45G #POCOM4 #KillerLooksOPPerformerhttps://t.co/1Ktb1yA3hI pic.twitter.com/J9XqjdAirV
— Mohammad Aslam (@gadget_024) May 1, 2022