రీల్స్.. వీటి గురించి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కొందరు వీటిని చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటే, కొందరు వాటిని చూస్తూ కాలం గడిపేస్తుంటారు. టిక్ టాక్ అనేది భారత్‌లో బ్యాన్ అయిన తర్వాత ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కు ఎంతో ఆదరణ పెరిగింది. అంతా ఇన్‌స్టా రీల్స్ పై ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా రీల్స్ కు సంబంధించి ఎన్నో కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంది.
ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా స్టార్స్ గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. సెలబ్రిటీలు ఇన్‌స్టా రీల్స్ చేయడం చూశాం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సెలబ్రిటీలు అయిన వాళ్లని కూడా చూశాం. కొత్తగా మూడు కొత్త ఫీచర్లను పరియచం చేయనున్నట్లు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మొస్సెరీ స్వయంగా ప్రకటించారు. వాటిలో ప్రధానంగా రీల్స్ రీచ్ పెంచుకునేందుకు ఒక కొత్త ఫీచర్ ఉండటం విశేషం.
మీరు చేసే రీల్స్ ను ఫేస్‌బుక్‌లో క్రాస్ పోస్టింగ్ చేసే సదుపాయాన్ని ఈ ఫీచర్ అందిస్తుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ లో పోస్ట్ అవుతుంది. అందుకు మీరు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఉండాలి. అలాచేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్ పేస్‌బుక్ ఫీడ్‌లోనూ పోస్ట్ అవుతుంది. తద్వారా మీకు రీచ్ పెరుగుతుంది అంటూ మొస్సెరీ వివరించారు.
అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన యాడ్ యువర్స్ అనే స్టిక్కర్ ఫీచర్ అందిరీకీ తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇన్‌స్టా స్టోరీలకు పాపులర్‌గా ఉంది. ఇప్పుడు రీల్స్ కు కూడా యాడ్ యువర్స్ ను రీల్స్ కు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా రీల్స్ మరింత కొత్తగా చూపించవచ్చు, ఎక్కువ మందికి రీచ్ చేయచ్చు అంటున్నారు.
ఇన్ సైట్స్ కోసం మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. అదేంటంటే ఫేస్ బుక్ లో మీరు పోస్ట్ చేసే రీల్స్ ఇన్ సైట్స్ ను చూసుకునే సదుపాయం. దీనిద్వారా రీచ్, యావరేజ్ వ్యూ టైమ్, టోటల్ వ్యూ టైమ్‌ను ఈ ఇన్ సైట్స్ లో చూసుకోవచ్చు. దీన్ని బట్టి ఫేస్‌బుక్ లో మీ రీల్స్ ఎంత రీచ్ ఉంటున్నాయో తెలుసుకోవచ్చు. ఈ మూడు అద్భుతమైన ఫీచర్లు అతి త్వరలో ఇన్ స్టాగ్రామ్‌కు యాడ్ అవ్వనున్నాయి. ఈ సరికొత్త ఫీచర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
📣 Reels Updates 📣
We’re launching a few new Reels features to make it fun and easy for people to find + share more entertaining content:
– ‘Add Yours’ Sticker
– IG-to-FB Crossposting
– FB Reels InsightsHave a favorite? Let me know 👇🏼 pic.twitter.com/RwjnRu5om2
— Adam Mosseri (@mosseri) August 16, 2022