స్మార్ట్ ఫోన్ లేకుండా జీవించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అలాగే ఉన్నాయని మీకు తెలుసా?
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనిషిలో ఒక భాగం అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లేకుండా మనిషి ఇప్పుడు బాత్ రూమ్ కి కూడా వెళ్లలేకపోతున్నాడు. అయితే అలాంటి స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. ప్రమాదాలు కూడా అన్నే ఉన్నాయని మీకు తెలుసా? మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే మీ బయోడేటా మొత్తం బ్లాక్ మార్కెట్లో ఉన్నట్లే. ఎందుకంటే మీరు వాడే చాలా యాప్స్ మీ మొత్తం సమాచారాన్ని బయట పెట్టేస్తాయి. మీ ఫొటోస్, కాంటాక్స్, మెసేజెస్, బ్యాంక్ డీటెయిల్స్ ఇలా అన్నీ ప్రమాదంలో పడినట్లే. అయితే ఇలాంటి ఘటనలపై కేంద్రం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
యూజర్ల సమాచారాన్ని చోరీ చేసి పొరుగు దేశాలకు పంపే చాలా యాప్స్ మార్కెట్ లో ఉన్నాయి. వాటి వల్ల మన వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడినట్లే. అలాంటి యాప్స్ ఎక్కువగా చైనా నుంచే తయారవుతుంటాయి. యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు కేంద్రం ఇప్పటికే వందల కొద్దీ చైనా యాప్స్ ని బ్యాన్ చేసింది. అంతేకాకుండా మీకు ఏదైనా యాప్ కావాలి అంటే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. అంటే ప్లే స్టోర్ ఆ యాప్ పై నిఘా ఉంచుతారనే నమ్మకం ఉంటుంది. నమ్మకం లేని యాప్స్ ని మనం అన్ ఇన్ స్టాల్ చేస్తాం. కానీ, మీరు ఫోన్ కొనే సమయంలో ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ ఉంటాయి కదా.. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
అవును ఒక యాప్ ప్రమాదకారి అని తెలియాలి అంటే దానిని ముందుగా పరీక్షించాలి. ప్లే స్టోర్ లో యాప్స్ పై ఆ సంస్థ నిఘా ఉంటుంది. నెట్టింట దొరికే యాప్స్ పై గూగుల్ పర్యవేక్షిస్తుంటుంది. కానీ, మీరు స్మార్ట్ ఫోన్ కొనే సమయంలో వచ్చే ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ పై ఎవరి నిఘా ఉంటుంది? ఎవరు వాటిని పరీక్షించి ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం శూన్యం. ఎందుకంటే మీ ఫోన్లో ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ ని ఎవరూ పరీక్షించరు. ఫోన్ కంపెనీ మీకు ఏ యాప్ ప్రీ ఇన్ స్టాల్ ఇస్తుందో దానిని మీరు అన్ ఇన్ స్టాల్ కూడా చేయలేరు. పైగా ఆ యాప్స్ కి అన్ని పర్మిషన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి యాప్స్ నిరంతరం మీ డేటాని కలెక్ట్ చేస్తుంటుంది.
మీ బ్రౌజింగ్ బిహేవియర్, మీరు ఫోన్ వాడే తీరు, మీ మెసెజెస్, లొకేషన్ ఇలా ప్రతిదీ ట్రాక్ చేయగలదు. మీ డేటా మొత్తాన్ని వేరే దేశానికి ట్రాన్స్ ఫర్ కూడా చేయగలదు. మరి అలాంటి ప్రమాదకారి యాప్స్ ని ఫోన్లు ఎందుకు ప్రీ ఇన్ స్టాల్ చేస్తున్నాయి. అనే అనుమానం రావచ్చు. అందుకు సమాధానం ఒక్కటే.. ఆయా యాప్స్ వాళ్లు ఫోన్ తయారీ కంపెనీకి డబ్బు చెల్లిస్తారు. మా యాప్ ప్లీ ఇన్ స్టాల్ చేస్తే ఫోన్ కి ఇంత అమౌంట్ ఇస్తామంటూ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఫోన్ తయారీ ఖర్చు ఒక రూ.వెయ్యి తగ్గుతుంది కదా అని ఫోన్ కంపెనీలు ఆయా యాప్స్ ని ప్రీ ఇన్ స్టాల్ చేస్తారు. యూకేలాంటి చోట్ల ఇలాంటి ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ పై ఆంక్షలు ఉంటాయి.
అయితే వాటిని లేకుండా ఫోన్ తయారు చేయడం, లేదా అవి ఉంటే వాటిని అన్ ఇన్ స్టాల్ చేసేందుకు పర్మిషన్ యూజర్ కి ఉండటం చేయాలి. ఇప్పుడు భారతదేశంలో కూడా అలాంటి రూల్స్ తీసుకొచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఒక పెద్ద మీటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇకపై వచ్చే స్మార్ట్ ఫోన్లలో ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసేందుకు యూజర్ కు పర్మిషన్ ఇవ్వాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేయనున్నట్లుతెలుస్తోంది. అదే జరిగితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని యాప్స్ వల్ల మీ వ్యక్తిగత సమాచారం తప్పకుండా చోరీకి గురవుతూ ఉంటుంది. అలాంటి సమాచారాన్ని పొరుగు దేశాలను మనకు వ్యతిరేకంగా వాడేందుకు అవకాశం కూడా ఉంటుంది.
మీరు కొత్తగా ఫోన్ కొనగానే అందులో ఉండే ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ మొత్తాన్ని అన్ ఇన్ స్టాల్ చేసేయండి. ఆ తర్వాత ప్లే స్టోర్ నుంచి మీకు ఆ యాప్స్ కావాలి అనుకుంటే తిరిగి డౌన్లోడ్ చేసుకోండి. అలా చేస్తే మీరు వాడే యాప్స్ పై ఒకరి నిఘా ఉందనే నమ్మకం మీకు ఉంటుంది. అయితే ఇప్పటికే ఫోన్లు వాడుతున్న వాళ్లు ఏం చేయాలి అంటే.. మీ ఫోన్లే ఉండే ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ ఇన్ఫో చూడండి. వాటిలో దాదాపుగా అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఉంటాయి. ఆ పర్మిషన్స్ ని క్యాన్సిల్ చేయండి. అలాగే అందులో ఉండే డేటా కూడా క్లియర్ చేయచ్చు. అలా చేస్తే ఆ యాప్స్ మీ డేటాని తీసుకునేందుకు అవకాశం ఉండదు.