ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్ లో విడుదలయ్యింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్ ప్రో.. ఇలా నాలుగు వేరియంట్లలో మార్కెట్లోకి రానున్నాయి. రేపో.. మాపో.. అందరి చేతుల్లోనూ కనిపించనున్నాయి. ఈ తరుణంలో ఐఫోన్ 14 గురుంచి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం..
మనదేశంతో ఐఫోన్ ధరలు విదేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. నాలుగైదు రకాల ఇంపోర్ట్ టాక్సులు ఉండడమే అందుకు కారణం. ఈ కారణంగా భారతీయులు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను విదేశాల నుంచి తెప్పించుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అలా తెప్పించుకుంటున్న వారిలో మీరు ఉన్నట్లయితే.. ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉదాహరణకు మీరు అమెరికా నుంచి తెప్పించుకుంటున్నారనుకుంటే.. అమెరికాలో ఈ-సిమ్స్ మాత్రమే ఉంటాయి. వాటిని ఇక్కడికి తెప్పించుకున్నాక.. ఈ-సిమ్స్ మాత్రమే వేయాలి.. ఫిజికల్ సిమ్స్ పనిచేయవు. మనదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మాత్రమే ఈ- సిమ్స్ ఇష్యూ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
మనదేశంలో ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.79,900 నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో మనదేశంతో పోల్చితే అమెరికాలో ఐఫోన్ 14 ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
అమెరికాలో ఐఫోన్ 14 ధర (128జీబీ వేరియంట్) $799 (సుమారు రూ. 63,920) నుంచి ప్రారంభమవుతుంది. అయితే.. మీరు ఏ రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తున్నారు అన్న దాని ఆధారంగా 8.5 -13 శాతం వరకు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు న్యూయార్క్ లో కొన్నారనుకుంటే..
అంటే.. భారతదేశంలో ఐఫోన్ 14 బేస్ వేరియంట్ ధరతో పోలిస్తే.. దాదాపు రూ. 7,000 తక్కువ. అదే.. 14 ప్రో వేరియంట్ చూస్తే.. మనదేశంలో దీని ధర రూ.1,29,900. అదే న్యూయార్క్ లో..
ఇది భారతీయులు బేస్ 14 ప్రో వేరియంట్ కోసం చెల్లించాల్సిన దాని కంటే దాదాపు 40,000 తక్కువ. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.