బౌల్ట్ ఆడియో కంపెనీకి భారత్ లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కొద్దిపాటి సమయంలోనే వినియోగదారుల నమ్మకాన్ని పొందారు. తక్కువ ధరలో మంచి ఉత్పత్తులను అందిస్తున్నారు. తాజాగా స్టైలిష్ లుక్స్ లో ఓ స్మార్ట్ వాచ్ ని భారత్ లో విడుదల చేశారు.
బౌల్ట్ ఆడియో కంపెనీకి చాలా కొద్ది సమయంలోనే మంచి క్రేజ్, డిమాండ్ వచ్చింది. వీళ్ల ఆడియో ప్రొడక్ట్స్ కి మాత్రమే కాదు.. స్మార్ట్ వాచెస్ కి కూడా మంచి డిమాండ్ పెరిగింది. ‘క్రాఫ్టెడ్ ఇన్ ఇండియా- ఫర్ ఇండియా’ అంటూ పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా వీళ్లు కొత్త కొత్త మోడల్స్ ని కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ధరలో బెస్ట్ మోడల్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా స్ట్రైకర్ పేరిట స్టైలిష్ లుక్స్ లో బౌల్ట్ కంపెనీ ఓ స్మార్ట్ వాచ్ ని ఇండియాలో రిలీజ్ చేసింది. ఆ వాచ్ స్పెసిఫికేషన్స్, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
బౌల్ట్ ఆడియో కంపెనీకి ఇండియాలో డిమాండ్ బాగా పెరిగింది. వాళ్ల సెల్లింగ్ రికార్డు చూసుకుంటే.. కోటికి పైగా యూనిట్స్ ని అమ్మకాలు చేశారు. ప్రతి 7 సెక్లకు ఒక యూనిట్ విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. బౌల్ట్ ఆడియో కంపెనీ తాజాగా భారత్ లో స్ట్రైకర్ పేరిట కొత్త స్మార్ట్ వాచ్ ని రిలీజ్ చేసింది. దాని ఎమ్మార్పీ రూ.7,999కాగా లాంఛింగ్ ఆఫర్ కింద కేవలం రూ.1,499కే అందిస్తోంది. అయితే ఈ స్పెషల్ ప్రైస్ ఎన్ని రోజులు ఉంటుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇంక లుక్స్ విషయానికి వస్తే చాలా స్టైలిష్ గా ఉంది. రౌండ్ అనలాగ్ డిజైన్ తో బ్లాక్, బ్లూ, క్రీమ్ వంటి మూడు కలర్ వేరియంట్స్ లో ఈ స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చారు.
ఇంక స్ట్రైకర్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 1.3 ఇంచెస్ రౌండ్ హెచ్ డీ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్, వారం రోజుల బ్యాటరీ బ్యాకప్, 20 రోజుల బ్యాటరీ స్టాండ్ బై, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్, 150కి పైగా వాచ్ ఫేసెస్, నాన్ స్టాప్ హెల్త్ మోనిటర్, ఓకే గూగుల్- సిరి వంటి వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ వాచ్ ఫ్లిప్ కార్ట్, బౌల్ట్ ఆడియో అధికారిక వెబ్ సైట్స్ లో లభిస్తోంది. బౌల్ట్ వెబ్ సైట్ లో అయితే ఫ్రీ షిప్పింగ్, 72 గంటల రీప్లేస్మెంట్ పాలసీని కూడా అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ పై ఏడాదిపాటు కంపెనీ వారెంటీ ఉంటుంది.