స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్.. ఇలా ప్రస్తుతం ఎటుచూసినా అంతా స్మార్ట్ మాయే!. రానున్న కాలంలో ఇంకెన్ని వస్తువులు.. ఈ స్మార్ట్ జాబితాలోకి చేరుతాయో అంతుపట్టడం లేదు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలానే.. స్మార్ట్ వాచ్ ల హవా ఎక్కువుగా నడుస్తోంది. ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. మరి ఇప్పుడు వాచ్ చేయలేని పని అంటూ ఉండదు. మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు. ఎంతసేపు నడుస్తున్నారు. ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తున్నారు. ఇలా ప్రతీ విషయాన్ని చెప్పేస్తున్నాయి. అందులోనూ చూడడానికి ఆకర్షణీయంగానూ ఉంటున్నాయి. ఇంకేముంది జనాలు ఎగబడి మరీ వీటిని కొంటున్నారు.
మొదట్లో స్మార్ట్ వాచ్ ల ధరలు చాలా ఎక్కువుగా ఉండేవి. తక్కువలో తక్కువ ఎంత లేదన్నా రూ. 5 నుంచి 10 వేలు ఉండేవి. కానీ, ప్రస్తుతం పలు దేశీయ కంపెనీలు కూడా వీటిని తయారీ చేస్తుండడంతో స్మార్ట్ వాచ్ ధరలు బాగా తగ్గుముఖంపట్టాయి. అందులోనూ.. స్మార్ట్ ఫోన్లలా అన్ని ఫీచర్లు స్మార్ట్ వాచుల్లో ఉంటుండడంతో వినియోగదారులను బాగా అట్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ సంస్థ బోట్.. తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్‌వాచ్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.2,500లోపు ధరతోనే బ్లూటూత్ కాలింగ్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, 60కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్‌తో ‘బోట్ వేవ్ కనెక్ట్‘ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది.
boAt Wave Connect smartwatch with Bluetooth calling launched in India, price starts at Rs 2,499 https://t.co/vpUN735iiu
— 91mobiles (@91mobiles) June 7, 2022
ధర
బోట్ వేవ్ కనెక్ట్ స్మార్ట్ వాచ్ ధర రూ.2,499గా ఉంది. చార్కోల్ బ్లాక్, డీప్ బ్లూ, కూల్ గ్రే.. కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 7 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
Boat Wave Connect Smartwatch has been launched with Bluetooth Calling. #Boat #BoatWaveConnect #Smartwatch #SmartNews #wearables #smartwearables #Tech #News #Alert #TechNews #Technology pic.twitter.com/uWoMHntvs8
— Techarea (@Techarea_in) June 7, 2022
స్పెసిఫికేషన్స్
boAt Wave connect | blutooth calling smartwatch
Launched in India#boat #boatwaveconnect #smartwatch #boatsmartwatch pic.twitter.com/NOFbFo4YFt— RM Update (@RM_Update) June 6, 2022
ఇది కూడా చదవండి: OnePlus Nord Buds: సూపర్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్.. ధరెంతంటేLATEST TECH