స్వదేశీ దిగ్గజ స్మార్ట్ బ్రాండ్ ‘బోట్‘.. మరో స్మార్ట్‌వాచ్ ను లాంచ్ చేసింది. బడ్జెట్ రేంజ్‌లో అమోలెడ్ డిస్‌ప్లేతో ‘బోట్ స్టామ్ ప్రో‘ను . ఇటీవల విడుదలైన బోట్ స్టామ్ వాచ్‌కు అప్‌గ్రేడ్‌గా.. స్టామ్ ప్రోను తీసుకొచ్చింది.700కు పైగా ఫిట్‌నెస్ మోడ్స్‌ను ట్రాక్ చేసే సపోర్ట్, లైవ్ క్రికెట్ స్కోర్ అందించే ఫీచర్ ఉండటం ఈ వాచ్‌కు మరో సానుకూలతగా ఉంది.
బోట్ స్టామ్ ప్రో ధర:
బోట్ స్టామ్ ప్రో ఇంట్రడక్టరీ ధర రూ.2,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ సహా బోట్ అఫిషియల్ సైట్ లో ఈ వాచ్ అందుబాటులో ఉంది. యాక్టివ్ బ్లాక్, కూల్ గ్రే, డీప్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.
స్పెసిఫికేషన్స్:
1.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. డిసిప్లే స్క్వేర్ షేప్‌లో ఉండగా.. దీనికి 2.5D కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 325 పిక్సెల్ డెన్సిటీ వల్ల డిస్‌ప్లే క్వాలిటీ షార్ప్‌గా కనిపిస్తుంది. నిరంతర హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొలిచే SpO2 మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ సహా వాకింగ్, రన్నింగ్, బాక్సింగ్, డ్యాన్స్, క్రికెట్ సహా మొత్తంగా 700 ఫిట్‌నెస్ మోడ్స్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. కుకింగ్, మెడిటేషన్ లాంటి యాక్టివిటీలను కూడా ఈ వాచ్ ట్రాక్ చేస్తుందని బోట్ పేర్కొంది.
బ్లూటూత్ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినపుడు కాల్స్, లింక్ చేయవచ్చు. లైవ్ క్రికెట్ స్కోర్ కూడా వాచ్‌లో చూడవచ్చు. మొత్తంగా 100కుపైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే స్టామ్ ప్రో..10 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని బోట్ పేర్కొంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఎనేబుల్ చేసుకొని వినియోగిస్తే 2 రోజులు వస్తుందని తెలిపింది. 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
Boat Storm Pro Comes with IP68 Dust, Sweat and Splash Resistant pic.twitter.com/OCKuIAfSyw
— RTT24x7 (@rtt24x7) July 14, 2022
ఇది కూడా చదవండి: YouTube: రూ.10కే యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్.. ఎలా పొందాలంటే..!
ఇది కూడా చదవండి: Nothing Phone (1): నథింగ్ ఫోన్ 1 పై రూ. 3,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?