స్మార్ట్ వాచెస్ వాడకం బాగా పెరిగిపోయింది. అలంకరణ కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా స్మార్ట్ వాచెస్ ని వాడుతున్నారు. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ వంటి వాటిని ట్రాక్ చేసుకునేందుకు ఈ వాచెస్ బాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కి కూడా యూజ్ అవుతాయి.
స్మార్ట్ వాచ్, ఆడియో గ్యాడ్జెట్స్ మార్కెట్ లో బోట్ కంపెనీకి మంచి స్థానం, గుర్తింపు ఉంది. బోట్ కంపెనీ నుంచి ఏ వస్తువైనా బడ్జెట్ ధరలో ప్రీమియం క్వాలిటీతో వస్తాయనే గుడ్ విల్, మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలిగారు. బోట్ అంటే ఆడియో ఎక్విప్మెంట్ కి బెస్ట్ అని భావిస్తారు. కానీ, ఇప్పుడు స్మార్ట్ వాచెస్ లో సైతం వీళ్లు మంచి నంబర్స్ ని రీచ్ అయ్యారు. ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో గ్యాడ్జెట్స్ తీసుకురావడం బోట్ ప్రత్యేకత. ఇప్పటికే బోట్ కంపెనీ ఎన్నో బడ్జెట్ స్మార్ట్ వాచెస్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ ని ఆ కంపెనీ రిలీజ్ చేసింది.
ఇయర్ బడ్స్, స్పీకర్స్, స్మార్ట్ వాచెస్ విక్రయాల్లో బోట్ కంపెనీకి మంచి మార్కెట్ ఉంది. తాజాగా బోట్ కంపెనీ నుంచి వేవ్ కాల్ లీప్ అనే స్మార్ట్ వాచ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ స్మార్ట్ వాచ్ కూడా బడ్జెట్ లోనే ఉంది. దాని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 1.83 ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లేతో వస్తోంది. 550 నిట్స్ బ్రైట్ నెస్, 240*280 రెజల్యూషన్ తో వస్తోంది. దీనిలో అడ్వాన్స్ డ్ బ్లూటూత్ కాలింగ్ ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో మీరు 20 కాంటాక్ట్స్ వరకు సేవ్ చేసుకోవచ్చు. డైల్ ప్యాడ్ కూడా ఉంటుంది. నేరుగా మీరు మీ స్మార్ట్ వాచ్ నుంచి కాల్ చేయవచ్చు. అలాగే మీ స్మార్ట్ వాచ్ లోనే మీ కాల్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు.
ప్రీమియం మెటల్ డిజైన్ తో రావడం ఈ వాచ్ లో మరో ప్రత్యేకత. బ్లూ, బ్లాక్, బ్లోసమ్ అనే మూడు కలర్ వేరియంట్స్ తో వస్తోంది. ఈ వాచ్ లో 100కి పైగా యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇవి మీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని ట్రాక్ చేస్తాయి. బ్లూటూత్ కాలింగ్ తో 3 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సాధారణంగా వాడితో 10 డేస్ బ్యాటరీ ఉంటుంది. 60 రోజులు స్టాండ్ బైలో ఉండగలదు. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ వంటి వాటిని కూడా ట్రాక్ చేస్తుంది. ఇంక ఈ వాచ్ ధర విషయానికి వస్తే.. రూ.7,999 కాగా 78 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,799కే అందిస్తున్నారు. ఈ బోట్ వేవ్ లీప్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.