స్మార్ట్ వాచ్ లు, ఇయర్ బడ్స్ వాడకం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అందుకే ఇయర్ బడ్స్ తయారు చేసే కంపెనీలు కూడా బాగా పెరిగిపోయాయి. వాటిలో బోట్ కంపెనీకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు బోట్ కంపెనీ మరో కొత్త బడ్జెట్ ఇయర్ బడ్స్ ని విడుదల చేసింది.
ఆడియో గ్యాడ్జెట్స్, ఇయర్ బడ్స్ సెక్షన్ లో భారత్ లో బోట్ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. తక్కువ ధరలో బెస్ట్ ఆడియో అవుట్ పుట్ తో బోట్ ప్రొడక్ట్స్ ఉండటమే యవతును బాగా ఆకట్టుకునే అంశం. ఇప్పటికే బోట్ కంపెనీ నుంచి చాలా మోడల్స్ ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్ ఉన్నాయి. వాటిలో దాదాపుగా అన్నీ బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి. తాజాగా భారత మార్కెట్ లో బోట్ కంపెనీ మరో బడ్జెట్ రేంజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ని విడుదల చేసింది. ఆ ఇయర్ బడ్స్ ధర ఎంత? వాటిలో ప్రత్యేకతలు ఏంటి? అసలు ఈ మోడల్ ని ఎందుకు కొనుగోలు చేయాలి? అనే అంశాలను ఇప్పుడు చూద్దాం.
బోట్ కంపెనీకి భారత్ లో మంచి ఆదరణ ఉంది. ఈ కంపెనీ బడ్జెట్ లో చాలా మంచి క్వాలిటీతో ఇయర్ బడ్స్ ని తయారు చేస్తుంటారు. తాజాగా ఈ కంపెనీ నుంచి సరికొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ విడుదల అయ్యాయి. అవి కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉండటం విశేషం. ఈ బోట్ నిర్వాణ ఇయాన్ ఇయర్ బడ్స్ లో బ్యాటరీ బ్యాకప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఇయర్ బడ్స్ 24 గంటల ప్లే టైమ్ ని అందిస్తాయి. ఒక్ ఇయర్ బడ్ లో 70 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కేస్ ఛార్జింగ్ తో కలుపుకుని చూస్తే మొత్తం 120 గంటల వరకు ప్లేబ్యాక్ సపోర్ట్ లభిస్తుంది.
బోట్ బ్యాలెన్స్ డ్ సౌండ్, బోట్ సిగ్నేచర్ సౌండ్ అంటూ.. డ్యూయల్ ఈక్యూ మోడ్ ఉంది. ఈ ఇయర్ బడ్స్ లో 60 ఎంఎస్ లో ల్యాటెన్సీతో బీస్ట్ మోడ్ ఉంది. ఇది గేమింగ్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. ముఖ్యంగా మంచి సౌండ్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుందంటున్నారు. ఇందులో ఇన్ ఇయర్ డిటెన్షన్ టెక్నాలజీ ఉంది. అంటే మీరు చెవిలో నుంచి తీయగానే ఆటోమేటిక్ గా సాంగ్ పాజ్ అవుతుంది. మంచి స్లిమ్ అండ్ కాంపాక్ట్ సైజ్ డిజైన్ తో వస్తోంది. ఇంక ఈ బోట్ నిర్వాణ ఇయర్ బడ్స్ ధర విషయానికి వస్తే.. లాంఛిగ్ ఆఫర్ గా రూ.1,999కే అందిస్తున్నారు. అయితే ఈ స్పెషల్ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుంది అనేది చెప్పలేం.
Stand up more often than you fall. Goal more times than you miss.
Join him the road to becoming The Next Big Thing with boAt Nirvana ION. pic.twitter.com/pViWDtsA9B
— boAt (@RockWithboAt) March 23, 2023