‘వన్‌ప్లస్‘.. ఈ పేరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు పెట్టింది పేరు. గతంలో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ధర 35 వేల నుంచి 40 వేలపైనే ఉండేది. అయితే.. మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే భారతదేశంలో.. ధర ఎక్కువని చాలామంది వీటికి దూరంగా ఉండేవారు. దీంతో వన్‌ప్లస్ సంస్థ ఒక మెట్టు కిందకు దిగి.. అందరకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో రూ.25,000 ధరలో నార్డ్ సిరీస్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. దీంతో వన్‌ప్లస్ ఫోన్లకు భారత మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. ఒక్క నిర్ణయంతో భారతీయుల నాడి పట్టిన సదరు సంస్థ అదే కొనసాగింపుగా ఒకే సిరీస్ లో పలు మోడళ్లను రిలీజ్ చేస్తోంది. తాజాగా వన్‌ప్లస్ ‘నార్డ్ 2టీ’ 5జీ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది.
వన్‌ప్లస్ ‘నార్డ్ 2టీ’ 5జీ రెండు వేరియంట్లలో లభించనుంది. 8జీబీ ర్యామ్/ 125 స్టోరేజ్ ధర రూ.28,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 33,999. అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోను అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే.. ఈ ఆఫర్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2టీ బేస్ వేరియంట్‌ను రూ.27,499 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.32,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
అయితే.. అమెజాన్‌లో రూ.19,100 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. అంటే ఈ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.19,100 వరకు తగ్గింపు పొందొచ్చన్నమాట. ఉదాహరణకు మీ పాత మొబైల్‌కు ఎక్స్‌ఛేంజ్‌లో రూ.15,000 డిస్కౌంట్ లభిస్తే.. మీరు మిగతా రూ.13,999 చెల్లించి బేస్ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీ పాత మొబైల్‌కు అంతకన్నా తక్కువ డిస్కౌంట్ వస్తే మిగతా మొత్తం చెల్లించాలి.
వన్‌ప్లస్ ‘నార్డ్ 2టీ’ 5జీ అసలు ధర:
8జీబీ ర్యామ్, 125 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. రూ. 28,999
12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజహ మోడల్ ధరను రూ. 33,999
‘నార్డ్ 2టీ’ 5జీ స్పెసిఫికేషన్స్:
అమెజాన్ అందిస్తోన్న ఈ అద్భుతమైన ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: OnePlus Nord Buds: సూపర్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్.. ధరెంతంటే?