పెళ్ళై.. పిల్లలొచ్చాక.. వారి ప్రపంచమే తల్లిదండ్రుల ప్రపంచం. అలా అని తల్లిదండ్రులు, పిల్లలతో 24 గంటలు గడపలేరు. కొన్ని సమయాల్లో బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఏదైనా అత్యవసర పనులుంటే.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావొచ్చు.అలాంటి సమయాల్లో అయ్యో.. పిల్లను చూడలేకపోతున్నామే అన్న బెంగ కలగొచ్చు. అలాంటివారికి ఆనందాన్నిచ్చే వార్త ఇది. మీరెక్కడున్నా మీ పిల్లలను లైవ్‌లో మానిటర్ చేసి చూపించే యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీ పిల్లలను నిరంతరం మానిటర్ చేయొచ్చు.
అందులోనూ.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే.. పిల్లలను చూసుకోవడం చాలా ఇబ్బంది. ఇంట్లో పెద్దవాళ్లో లేదా పనిమనుషులో ఉన్నా బిడ్డ ఏం చేస్తోందోనని తల్లిదండ్రులకు ఉండటం సహజం. దీనికి పరిష్కారంగా ఈ యాప్స్. వీటిలో మీకు నచ్చిన యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీరెక్కడున్నా ఇంట్లో మీ బుబ్జాయి/బాబు ఏం చేస్తుందో, తింటుందో, పడుకుందో, ఆడుకుంటుందో కనిపెట్టుకుని ఉండొచ్చు.
ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు అందుబాటులో ఉంది. దీన్ని మీరు రెండు స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకటి బేబీ ఉన్న దగ్గర పెట్టి.. మరో మొబైల్‌లో మీ దగ్గర ఉంచుకోవాలి. దీంతో బేబీని ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చు.
అలాంటి మరికొన్ని యాప్స్:
Netgear, iBaby M6 Wi-Fi, Nest Cam ఇండోర్ Wi-Fi, Dropcam Pro, Arlo Baby, Motorola లాలిపాప్ బేబీ మానిటర్, సమ్మర్ ఇన్‌ఫాంట్ స్మార్ట్‌క్యామ్, Samsung SmartCam HD Plus Wi-Fi.. ఇలా పలు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చినది.. సురక్షితమైనది ఎంచుకోండి.