క్రేజీ ఫీచర్లు, హాట్ స్పెసిఫికేషన్స్‌తో టెక్ ప్రియులను ఊరించిన నథింగ్ ఫోన్ 1 మొబైల్ మార్కెట్ లోకి అడుగుపెట్టి రోజులు గడుస్తున్నా.. దాని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గట్లేదు. దానికి ప్రధాన కారణం.. యూనిక్ డిజైన్. ట్రాన్స్‌ప్రరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది. ఆ యూనిక్ డిజైన్ చూశాక.. మనకు కూడా నథింగ్ ఫోన్ కొందామనే ఆలోచన రావడం సహజం. అయితే.. అంతకుముందే మన దగ్గర ఇంకో ఫోన్ ఉంటుండడంతో.. ఆ ఆలోచనకు దూరంగా ఉంటున్నాం. అదే.. మన స్మార్ట్ ఫోన్ ను.. నథింగ్ ఫోన్ లా మార్చే ఉపాయం ఉంటే.. ఎంచక్కా వాడేస్తాం కదా!. ఇప్పుడు అలాంటి ఉపాయంతో మీ ముందకొస్తున్నాం.. మీకు నచ్చితే ఫాలో అయిపోండి.
నథింగ్ ఫోన్ లో ఉన్న.. ట్రాన్స్‌ప్రరెంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ గురుంచి అందరకి తెలిసిందే.. కదా! కాల్స్, మెసేజెస్,నోటిఫికేషన్స్.. ఇలా ఎలాంటి అలర్ట్స్ వచ్చినా.. గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్.. జిగేల్ మని వెలుగుతుంది. ఇప్పుడు అలాంటి అనుభూతిని మనకు కలిగించడం కోసం టెక్నాలజీ న్యూస్ ను అందించే మీడియా జెయింట్ ‘బీబామ్ కో’ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మనం వాడుతున్న మొబైల్.. ఏ మోడల్ అయినా సరే గ్లిఫ్ ఇంటర్ఫేస్ లాంటి డిజైన్ తో బ్యాక్ కవర్ అందిస్తామంటోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఉపాయం మీకు నచ్చినట్లయితే.. వెంటనే ఆర్డర్ ఇచ్చేసి.. మీ ఫోన్ ను నథింగ్ ఫోన్ లా మార్చేసుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను, లేదా ఇంతకంటే మంచి ఐడియాలు మీ మైండ్ లో ఉన్నట్లయితే వాటిని.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Nothing Phone 1: ‘నథింగ్ ఫోన్’ కొనాలనుకుంటున్నారా? ఈ ఒక్క విషయంలో జాగ్రత్త..!
ఇదీ చదవండి: Nothing Phone (1): ఇంత హైప్ వచ్చిన నథింగ్ ఫోన్ లో సమస్యలు ఇవే..!