ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో వాహన దారులకు మరో శుభవార్తను అందించింది. మార్కెట్లోకి కొత్త లుక్‌తో కూడిన మరో పల్సర్ బైక్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే ఈ కంపెనీ నుంచి మొత్తం ఎనిమిది మోడల్స్ 125 సిసి నుంచి 220 ఉండగా తాజాగా బజాజ్ పల్సర్ 250 సిసి టీజర్ ను విడుదల చేసింది.
అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ బైక్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ప్రధానంగా యువత ఎక్కువగా పల్సర్ బైక్ ను కొనేందుకు ఇష్టపడతారు. దీని మూలంగానే బజాజ్ ఆటో అత్యాధునిక హంగులను జోడిస్తూ బైక్ హెడ్ ల్యాంప్‌లు , టెయిల్ ల్యాంప్‌లు కూడా చాలా అడ్వాన్స్‌డ్ పరికరాలతో ఈ వాహనాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బైక్ ను బజాజ్ కంపెనీ 28 అక్టోబర్ 2021 మార్కెట్ లోకి తీసుకురానుంది. ఇక పల్సర్ 250 సిసి మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల అవుతుందా అని పల్సర్ ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.