స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడటం అనవరమని.. డబ్బు- సమయం వృథా చేసుకుంటున్నారంటూ చాలా మంది వాదిస్తుంటారు. అయితే స్మార్ట్ వాచెస్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక యాపిల్ స్మార్ట్ వాచ్ ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న కొత్త టెక్నాలజీతో మనిషి జీవనం ఎంతో సులభతరం అవుతోంది. అయితే శర వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తప్పుబట్టేవాళ్లు కూడా లేకపోలేదు. చాలామంది స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని వాడటాన్ని కండిస్తుంటారు. వాటివల్ల మనిషి వెనుకబడి పోతున్నాడంటూ వాదిస్తుంటారు. అయితే స్మార్ట్ గ్యాడ్జెట్స్ మనిషులకు మేలు చేస్తాయని వాదించే వాల్లు కూడా ఉన్నారు. ఈ ఘటన చూస్తే స్మార్ట్ గ్యాడ్జెట్స్ ప్రాణాలు కూడా కాపాడగలవని నమ్మకం కలుగుతుంది. ఓ యాపిల్ స్మార్ట్ వాచ్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. అదెలాగే ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్ వాచెస్ వాడటం ఇప్పుడు సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు. ఇప్పిటికే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్ అనే కథనాలు కూడా విన్నాం. తాజాగా అలాంటి మరో ఘటన అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ లో వెలుగు చూసింది. అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కెన్ కౌనిహన్ కు ఓ రోజు యాపిల్ స్మార్ట్ వాచ్ నుంచి అలర్ట్ వచ్చింది. అతని బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నట్లు ఆ వాచ్ అలర్ట్ చేసింది. అతను వెంటనే ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత కుటుంబం బలవంతం మీద ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతనికి కొన్ని మందులు రాసిచ్చారు.
తర్వాత మళ్లీ అతనికి అదే తరహాలో అలర్ట్ వచ్చింది. అతని బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయంటూ యాపిల్ వాచ్ హెచ్చరించింది. అతను వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అప్పుడు అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చిరించారు. ఆ విధంగా యాపిల్ స్మార్ట్ వాచ్ క్లీవ్ ల్యాండ్ లో ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. స్మార్ట్ వాచెస్, స్మార్ట్ గ్యాడ్జెస్ వాడటం అనవసరం అని వాదించే వారికి ఇదొక గొప్ప ఉదాహరణ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.