Apple iPhone 14: ఐఫోన్ కొనడం కొందరికి అందని ద్రాక్షనే. ఎందుకంటే ఆ ఫోన్ ఖరీదు ఎక్కువ. కాకపోతే ఇతర ఫోన్‌లతో పోలిస్తే లుకింగ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్‌లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే ఖరీదైనా సరే ఆ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్14 కు సంబంధించి అదిరిపోయే న్యూస్ వచ్చింది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ డేట్ ఇదేనంటూ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు..
యాపిల్ సంస్థ ఐఫోన్14ను సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుందట. సాధారణంగా ఒక స్పెషల్ ఈవెంట్లో సెప్టెంబరు తొలి అర్థ భాగంలో ఐఫోన్‌లను ఆవిష్కరిస్తుంది. ఐఫోన్‌తోపాటు వాటి ఉత్పత్తులను ప్రకటించడం ఆనవాయితీ. ఈ మేరకు ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్టుసమాచారం. ఐఫోన్ 14 సిరీస్ నాలుగు వేరియంట్లలో లాంచ్ కానుంది. ఐఫోన్ 14/ 14 మ్యాక్స్/ 14 ప్రో/ 14 ప్రో మ్యాక్స్.
According to @markgurman, Apple is planning to hold their next event on Wednesday, September 7 to unveil the new iPhone 14 series. Gurman says Apple has told retail store employees to prepare for a new product release on Friday, September 16 pic.twitter.com/jjYx9g51EZ
— Apple Hub (@theapplehub) August 17, 2022
ఐఫోన్14 లాంచింగ్ అయిన వారం తర్వాత స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగానే ఐఫోన్14ను సెప్టెంబర్ 7 లాంచ్ చేసి.. సెప్టెంబర్ 16 నుంచి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచనుంది. ఫ్రీ ఆర్డర్స్ సెప్టెంబర్ 9 నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం ఐఫోన్14తో పాటు మూడు కొత్త ఆపిల్ వాచ్ మోడల్‌లు, అనేక కొత్త వెర్షన్‌లు మాక్‌లు ,ఐప్యాడ్‌లు లాంచ్ చేయనుంది. అంతేకాదు.. ఐఫోన్ 13 రేటుకే ఐఫోన్ 14 అందించనున్నట్లు వార్తలోస్తున్నాయి.
ఐఫోన్ 14 స్పెసిపికేషన్స్:
ఐఫోన్14 ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. వీడియోలు చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు 1170*2532 పిక్సెల్స్ రెజెల్యూషన్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక డ్యూయల్ సెటప్ రేర్ కెమెరా ఉంది. ఫోన్‌తో అద్భుతమైన ఫోటోల్ని తీసేందుకు 12ఎంపీ ప్లస్ 12ఎంపీ కెమెరాలు,సెల్ఫీలు దిగేందుకు, వీడియో కాల్స్ చేసుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 12ఎంపీ ప్లస్ ఎస్‌ఎల్ 3డీ కెమెరాతో రానుంది. ఐఓఎస్ వీ 15 ఆపరేటింగ్ సిస్టం, 3115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీంతో పాలు పలు రకాలైన కనెక్టివిటీ ఆప్షన్ ఉన్నాయి.
Everything we know about the iPhone 14 Pro ahead of it’s upcoming launch next month! Are you excited? pic.twitter.com/pJR619Qr0q
— Apple Hub (@theapplehub) August 17, 2022