ఈ- కామర్స్ వెబ్‌సైట్స్.. ప్రస్తుతం మానవ జీవితంలో ఇవొక భాగం అయిపోయాయి. గుండు పిన్ను నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఇంక ఏవైనా పండగలు, స్పెషల్ డేస్ వస్తే వీళ్లు ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్స్ అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 6 నుంచి 10 వరకు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నిర్వహిస్తోంది. అన్ని వస్తువులపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆ వివరాలేంటో చూద్దాం.
అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీ:
అమెజాన్ బేసిక్స్ కంపెనీకి చెందిన 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. 1.5 జీబీ రోమ్, క్వార్డ్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ బాండ్ వైఫై వంటి అద్భుతమైన ఫీచర్స్ ఈ టీవీ సొంతం. దీని ధర రూ.50 వేలు ఉండగా 48 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 25,999కే అందిస్తోంది.
వన్ ప్లస్ 32 ఇంచెస్ Y సిరీస్:
స్మార్ట్ ఫోన్లే కాదు.. వన్ ప్లస్ స్మార్ట్ టీవీలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అమెజాన్ సేల్ లో వన్ ప్లస్ వై సిరీస 32 ఇంచెస్ టీవీపై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. రూ.19,999 టీవీని రూ.13,499కే అందిస్తోంది. ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్, 64 బిట్ ప్రాసెసర్, ఇన్ బిల్డ్ ఓటీటీ యాప్స్ తో ఈ టీవీ లభిస్తోంది.
రెడ్‌మీ 55 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ:
రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలకు ఇండియాలో చాలా మంచి డిమాండ్ ఉంది. అందుకే ప్రతిసారి రెడ్ మీపై చాలా మంచి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. ఈసారి రెడ్‌మీ 55 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీపై అధిక డిస్కౌంట్స్ అందిస్తోంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ రోమ్, డాల్బీ ఆడియో, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వంటి అద్భుతమైన ఫీచర్లున్న రూ.54,999 ధర గల టీవీని కేవలం రూ.34,999కే అందిస్తోంది.
శాంసంగ్ 32 ఇంచెస్ వండర్‌టైన్మెంట్ సిరీస్:
శాంసగ్ 32 ఇంచెస్ వండర్‌టైన్మెంట్ సిరీస్‌కు చెందిన హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకు అందిస్తున్నారు. డాల్బీ డిజిటల్ ప్లస్, పవర్‌ఫుల్ స్పీకర్స్, గేమ్ ఎన్‌హాన్సర్, స్క్రీన్ షేర్, వైఫై, 1.5 జీబీ ర్యామ్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వంటి ఫీచర్లు కలిగిన శాంసంగ్ 32 ఇంచెస్ రూ.22,900 ధర కలిగిన స్మార్ట్ టీవీని రూ.14,989కి మాత్రమే అందిస్తున్నారు.
సోనీ బ్రావియా 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ:
సోనీ బ్రావియా సిరీస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. కానీ, ధర ఎక్కువగా ఉంటుందని చాలా మంది వాటి జోలికి వెళ్లరు. ఇప్పుడు అమెజాన్ అత్యధిక డిస్కౌంట్స్ తో సోనీ టీవీలను అందిస్తోంది. సోనీ x1 4కే ప్రాసెసర్, 4కే హెచ్‌డీఆర్, లైవ్ కలర్, ఓపెన్ బాఫెల్ స్పీకర్, డాల్బీ ఆడియో, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కలిగిన రూ.69,900 విలువైన సోనీ బ్రావియా 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ.47,990కే అందిస్తున్నారు.
ఇలాంటి అద్భుత ఆఫర్లు ఉన్న మరిన్ని స్మార్ట్ టీవీల వివరాలు:
క్రోమా 40 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ:
టాటా కంపెనీకి చెంది రూ.30 వేల విలువైన క్రోమా 40 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ.17,990కే అందిస్తున్నారు.
టీసీఎల్ 43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ:
ఇండియాలో తయారయ్యే టీసీఎల్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.47,990 కాగా ఆఫర్లో రూ.25,270కే అందిస్తున్నారు.
55 ఇంచెస్ శాన్సుయ్ 4కే:
రూ.56,790 విలువైన 55 ఇంచెస్ శాన్సుయ్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీని ఆఫర్లో రూ.33,900కే అందిస్తున్నారు.
ఇలాంటి మరెన్నో ఆఫర్లు స్మాార్ట్ ఫోన్లు, కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాషన్ వేర్ పై కూడా లభిస్తున్నాయి. నేరుగా వచ్చే డిస్కౌంట్స్ తో పాటుగా బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ సదుపాయం అంటూ మరెన్నో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ అందిస్తున్న ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.