స్మార్ట్ వాచ్ అంటే అందరికీ ఇష్టమే. చాలామందికి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అని ఉంటది. కానీ, బడ్జెట్ ఎక్కువ అవుతుందని కొనేందుకు వెనుకాడుతుంటారు. అలాంటి వారి కోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లో స్మార్ట్ వాచ్ తీసుకొచ్చాం. అది కూడా కేవలం రూ.499 ధరకే. తక్కువ ధర అని తీసిపారేయకండి. ఇందులో చాలానే ఫీచర్స్ ఉన్నాయి.
ప్రస్తుతం స్మార్ట్ వాచ్ అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు చెప్పండి? అందరూ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఫోన్లకే ఓట్లు వేస్తున్నారు. కానీ, స్మార్ట్ ఫోన్లు కొనాలి అంటే వారానికో మోడల్, నెలకో కొత్త ఫీచర్ తో మార్కెట్ లో హడావుడి చేస్తున్నాయి. ఒకసారి స్మార్ట్ వాచ్ కొంటే మళ్లీ మార్చాలి అంటే అంత తేలిగ్గా మనసు ఒప్పదు. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాచ్ లు చాలా తక్కువ ఉంటాయి. అందుకే మీకు ఒక సూపర్ లో కాస్ట్ స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చాం. ఇది కొన్నాక మీరు ఏ మోడల్ నచ్చినా మళ్లీ నిశ్చింతగా కొనేయచ్చు. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ ధర కేవలం రూ.500 మాత్రమే. అవును రూ.500కే ఒక స్టైలిష్ లుక్ లో మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయచ్చు.
సాధారణంగా తక్కువకి ఒక వస్తువు వస్తోంది అంటే.. ఎవరికైనా దాని క్వాలిటీ మీద అనుమానం వస్తుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ కి రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇప్పుడు చెప్పుకోబోయేది AJO బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ వాచ్ గురించి. దీని ఎమ్మార్పీ రూ.1,299 కాగా లాంఛింగ్ ఆఫర్ కింద కేవలం రూ.499కే అందిస్తున్నారు. అయితే ఇదే ప్రైస్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేం. దీనిని స్మార్ట్ వాచ్ గా కంటే ఫిట్ నెస్ బ్యాండ్ గా వాడుకుంటే ఇంకా బాగుంటుందని కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంక ఈ వాచ్ లో ఫీచర్స్ చాలానే ఉన్నాయి.
ఈ AJO స్మార్ట్ వాచ్ లో 1.33 ఇంచెస్ టీఎఫ్టీ- ఎల్సీడీ డిస్ ప్లే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 400 నిట్స్ బ్రైట్ నెస్ వస్తోంది. ఇందులో స్టెప్ కౌంట్, హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ క్వాలిటీ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ కమింగ్ కాల్స్, క్యాలెండర్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి సంబంధించి అలర్ట్స్ ని మీరు ఈ స్మార్ట్ వాచ్ లో చూడచ్చు. ఐపీ67 వాటర్ ప్రూఫ్ తో వస్తోంది. ఈ వాచ్ అన్ని ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈజీగా కనెక్ట్ చేయచ్చు. ఈ వాచ్ డేటా కోసం మీరు ఫోన్ లో వెరీఫిట్ ప్రో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇన్ని ఫీచర్స్ తో మరే స్మార్ట్ వాచ్ దొరకదంటూ టెక్ నిపుణులు కూడా దీనికే ఓటేస్తున్నారు. ఈ AJO స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.