ఎట్టకేలకు 5జీ సేవలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. వేలం పక్రియ కొనసాగుతోంది. 4జీతో పోలిస్తే పది రెట్లు వేగవంతంగా ఉండే 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా పోటీపడుతోంది. బుధవారం సాయంత్రంవరకు ఎవరు దక్కించుకున్నారన్న విషయం కొలిక్కిరావొచ్చు.
ప్రస్తుత 4జీ కంటే 5జీలో టెలికాం సేవల వేగం 10 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో టెలికం సంస్థలు 5జీ స్పెక్ట్రంను దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలో అక్టోబర్ చివరి కల్లా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రాధమిక దశలోనే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ 5జీ అందుబాటులో ఉండదు. తొలి విడుతలో భాగంగా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోస్తామని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ ఏడాది చివరినాటికి మిగతా నగరాలకు ఈ సేవలను విస్తారించనున్నట్లు ప్రకటించారు.
లేటెస్ట్ నెట్‌వర్క్ దేశం నలుమూలలకూ విస్తరించేందుకు కొద్ది నెలల సమయం పడుతుంది. దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని పరిస్ధితి. ఇక 5జీ సేవలు తొలుత భారత్‌లోని 13 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వస్తాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రాం, జామ్‌నగర్, పుణే, లక్నో, ముంబై, కోల్‌కతా నగరాల్లో ముందుగా 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి.
Information Technology Minister @AshwiniVaishnaw Said that the 5G Service in India Will Start By September-October. This Means, the Actual Service Of 5G Could Start As Early As September, Which is Just a Few Weeks Away From Now.#5G #5GService #5GIndia https://t.co/GezPxTW3G3
— Tech Master (@Tech_Master18) July 27, 2022
5G ఎలా పనిచేస్తుంది
5జీ.. అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. పైగా రేడియో తరంగాలను సమృద్ధిగా, సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ‘నెట్‌వర్క్ స్లైసింగ్’ అనే ప్రక్రియ ద్వారా సిమ్‌కార్డు అనేక తరంగాలను ఒకేసారి వినియోగించుకుంటుంది. ఇలాంటి మార్పులతో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయి.
ధర ఎలా ఉండొచ్చు?
అంచనాల ప్రకారం 5జీ అందుబాటులోకి రాగానే దాన్ని అందుపుచ్చుకునేందుకు 67 శాతం మంది సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరి, ధరలు అందుకు అనుమతిస్తాయా లేదా అంది చూడాలి. 4జీతో పోల్చుకుంటే 5జీ సేవలు కచ్చితంగా ఖరీదే! అయితే, పారిశ్రామిక వర్గాలనుంచి ఎక్కువ వసూలు చేస్తే సాధారణ వినియోగదారుల భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక కూడా 4జీ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తున్నాయి. పైగా, మారుతున్న సాంకేతికత వల్ల 4జీ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. 5జీ టెక్నాలజీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.