వ్యవసాయం చేసే వారికి అనేక రకాల ఉపకరణాలు ఉంటాయి. అయితే వాటిల్లో అతి ప్రధానమైనది ట్రాక్టర్. ఎందుకంటే పంట వేసే మొదలు.. చివరి వరకు అనేక దశల్లో ట్రాక్టర్ తో రైతులు చాలా పని ఉంటుంది. అయితే ట్రాక్టర్ ను డ్రైవర్ లేకుండా నడిపే.. కొత్త టెక్నాలజి వచ్చింది.
వ్యవసాయం చేసే వారికి అనేక రకాల ఉపకరణాలు ఉంటాయి. అయితే వాటిల్లో అతి ప్రధానమైనది ట్రాక్టర్. ఎందుకంటే పంట వేసే మొదలు.. చివరి వరకు అనేక దశల్లో ట్రాక్టర్ తో రైతులు చాలా పని ఉంటుంది. అయితే ట్రాక్టర్ తో పొలం దున్నాలంటే.. చాలా కష్టంతో కూడుంది. గంటలకొద్దీ ట్రాక్టర్ నడుపుతూ ఒళ్లు హూనం అవుతుంది. అయితే ఇలాంటి సమస్యకు పరిష్కారం మార్గాన్ని కనిపెట్టారు ఇద్దరు ప్రొపెసర్లు. వారి ఐడియాతో… గట్టున కూర్చొని పొలం దున్నొచ్చు. అది కూడా కేవలం రూ.20వేల ఖర్చుతోనే డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడుస్తుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
మనిషికి వచ్చే సమస్యలే కొత్త ఆవిష్కరణలకు పునాదులు. కొందరికి సొంతంగా వచ్చే సమస్యలతో ఆలోచన పుడితే, మరికొందరికి ఇతరల సమస్యలను చూడటం ద్వారా కొత్త వస్తువులను ఆవిష్కరణ చేస్తుంటారు. అలానే రైతుల కష్టాలను చూసి.. డ్రైవర్ సాయం లేని ట్రాక్టర్ ను రూపొందించారు వరంగల్ జిల్లా హసన్ పర్తిలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన ప్రోఫెసర్లు పి. నిరంజన్ రెడ్డి, మహ్మద్ వసీం. సెల్‌ఫోన్ సాయంతో కంట్రోల్ చేస్తూ పొలం దున్నే ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. దీనిని స్మార్ట్ అగ్రికల్చర్ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను 2019లో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి సమర్పించారు.
వీరి ప్రాజెక్ట్ ను పరిశీలించిన డీఎస్‌టీ 2020 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. అలానే వారి ప్రాజెక్ట్ ను డెవలప్ చేసేందుకు రూ.41లక్షలు మంజూరు చేసింది. అయితే కేవలం వీరు ఏడాది వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల కిట్స్ కళాశాలను సందర్శించిన సందర్భంలో ఈ ట్రాక్టర్‌ను పరిశీలించారు. డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్‌ను నడవటం చూసి అశ్యర్యపోయాన్ని వ్యక్తం చేశారు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండా ఎలా పనిచేస్తుందనే ప్రశ్నకు.. ఈ యువ ప్రొఫెసర్లు చక్కటి వివరణ ఇచ్చారు. డ్రైవర్ రహిత ట్రాక్టర్ తయారీలో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐవోటీ) టెక్నాలజిని ఉపయోగించామని చెప్పారు.
ఈ సాంకేతికతను ట్రాక్టర్, మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేస్తారు. అయితే ఈ ఐవోటీకి సంబంధించి ఓ యాప్‌ను ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక ఆ యాప్ ఓపెన్ చేయగానే డ్రైవింగ్ ప్రణాళికంతా కనిపిస్తుంది. కుడి, ఎడమ, ముందు, వెనుకకు తిప్పేందుకు రిమోట్ బటన్స్ ఉంటాయి. అలా పరిస్థితులను బట్టి, ఆ బటన్స్ ఉపయోగించి.. ట్రాక్టర్‌ను ఎటు కావాలంటే అటు గట్టు మీద కూర్చొనే నడపొచ్చు. అంతే కాక స్పీడ్ కూడా కంట్రోల్ కూడా ఉంటుంది. పొలంలోని పరిస్థితులను బట్టి స్పీడ్ ను నియంత్రించవచ్చు. మొత్తంగా రైతులు చెట్టు కింద కూర్చుని ఫోన్ సాయంతో పొలంలో ట్రాక్టర్‌ను నడపొచ్చని ప్రొఫెసర్లు వెల్లడించారు.
డ్రైవర్ రహిత ట్రాక్టర్ అమర్చిన ఐవోటీ కిట్ కోసం రూ.20వేలు మాత్రమే ఖర్చు అవుతుందని వారు తెలిపారు. ఐవోటీ టెక్నాలజీతో పనిచేసే ట్రాక్టర్లకు క్లచ్, గేర్లు ఉండవు. కాబట్టి రైతులకు డ్రైవింగ్ లో ప్రత్యేకంగా శిక్షణ అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు నివేదిక డీఎస్‌టీకి సమర్పిస్తామని వారు తెలిపారు. డీఎస్‌టీ దీనిని పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత పేటెంట్ ఇస్తుందని వెల్లడించారు. డీఎస్టీ నుంచి పేటెంట్ రైట్స్ రాగానే ఐవోటీ కిట్ మార్కెట్‌లోకి విడుదలవుతుందన్నారు. మరి.. ఈ నూతన ఆవిష్కరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.