ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం దాయాది దేశాల్లోనే కాదు, మొత్తం క్రికెట్ లవర్స్ ఈ పోరు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక ఆ మ్యాచ్ ఆడే ఆటగాళ్లు అయితే ఆ భావోద్వేగాన్ని, టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఈ విషయంలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉంటారు. కానీ.., పాక్ ఆటగాళ్లు మాత్రం ఇండియాతో మ్యాచ్ అనగానే ముందు నుండి ఛాలెంజ్ లు స్టార్ట్ చేస్తారు.
వారి మాజీలు సైతం తొడలు కొడుతూ, ఈసారి గెలుపు మాదే అని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. గతంలో కూడా ఓసారి షోయబ్ అక్తర్ ఇలానే ఛాలెంజ్ చేసి, చావు దెబ్బ తిన్నాడు. 2007 వరల్డ్ కప్ లో టీమిండియాకి, పాకిస్థాన్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ముందు రోజు.. సచిన్ ని తానే అవుట్ చేస్తా అని షోయబ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే.. మ్యాచ్ రోజు సచిన్ తన విశ్వరూపం చూపించాడు. పాక్ బౌలింగ్ ని ఊచకోత కోసి టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టాడు సచిన్.
ఇండియన్ క్రికెట్ టీమ్ చేతిలో ఇలాంటి అనుభవాలు, పరాభవాలు పాకిస్థాన్ కి చాలానే ఉన్నాయి. కానీ.., వారిలో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇప్పుడు టీ-ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా భారత్ పై విజయం మాదే అంటూ ఆ దేశ మాజీలు తొడలు కొడుతున్నారు. భారత్ మాత్రం ఎప్పటిలా మౌనంగానే ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ పాక్ టీమ్ పై తనదైన స్టయిల్ లో సెటైర్స్ పేల్చాడు.
ఇండియాతో మ్యాచ్ అనగానే పాకిస్థాన్ ప్లేయర్స్ ఎప్పుడూ తమ నోటికి పని చెప్తూ ఉంటారు. కానీ.., మనం మాత్రం మౌనంగా పని చేసుకుంటూ పోతుంటాము. ఎందుకంటే.. ఎప్పుడైనా పాకిస్థాన్ టీమ్ కన్నా, మన జట్టే బలంగా ఉంటుంది. ఈసారి కూడా మన జట్టే బలంగా ఉంది. ఫలితం కూడా జట్టు బలాన్ని బట్టే ఉంటుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. మరి.. ప్రతిసారిలానే ఈసారి కూడా పాక్ జట్టుని టీమిండియా మట్టి కరిపిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.