ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో భారత్ పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా జరుగుద్ది అనుకున్న మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కి శుభారంభం లభించింది.రిజ్వాన్, బాబర్ అజామ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఇండియా ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఓడిపోయిన దానికన్నా, భారత్ బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారన్న బాధ అభిమానుల నుండి ఎక్కువగా వినిపిస్తోంది. దాయాది జట్టు చేతిలో ఇలా ఓడిపోవడం ఇండియన్ క్రికెట్ లవర్స్ ని కాస్త నిరుత్సాహ పరిచింది. అయితే.., మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోని చేసిన ఓ పని మాత్రం ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది.
దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్ ముగిశాక ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు స్నేహపూర్వకంగా కనిపించారు. ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటూ అభినందించుకోవడం అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లోకి వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లతో చాలా సేపు సంభాషించడం విశేషం. పాక్ సీనియర్ ప్లేయర్స్, జూనియర్స్ అందరూ కూడా ధోని మాటలను ఆసక్తిగా వినడం విశేషం. ఇక వీరి సంభాషణని ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోకి #SpiritOfC Cricket #T20WorldCup అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండటం విశేషం. మరి.. ఈ విషయంలో ధోని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.