ప్రస్తుతం క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ ని మించి క్యాచులు అభిమానులని థ్రిల్ కి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా బౌండరీ రోప్ దగ్గర పట్టే క్యాచులు వావ్ అనేలా ఉన్నాయి. అలాంటి క్యాచ్ ఒకటి ఇప్పుడు అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
జింబాబ్వే వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లీగ్ మ్యాచ్ లని ముగించుకొని సూపర్ సిక్స్ పోరుకి సిద్ధమయ్యాయి టాప్ సిక్స్ జట్లు. ఇందులో భాగంగా నిన్న జరిగిన మొదటి మ్యాచులో ఆతిధ్య జింబాబ్వే తో ఒమన్ తలపడగా..జింబాబ్వే ఈ మ్యాచులో విజయం సాధించింది. ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచుల్లో దూసుకుపోతున్న జింబాబ్వేని ఒమన్ జట్టు గట్టిగానే నిలువరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ మ్యాచులో ఒక అద్భుతమైన క్యాచ్ నమోదుకావడం గమనార్హం. జింబాబ్వే ప్లేయర్ ల్యూక్ జోంగ్వే పట్టిన క్యాచ్ ఒకటి వైరల్ అవుతుంది.
ప్రస్తుతం క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ ని మించి క్యాచులు అభిమానులని థ్రిల్ కి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా బౌండరీ రోప్ దగ్గర పట్టే క్యాచులు వావ్ అనేలా ఉన్నాయి. అలాంటి క్యాచ్ ఒకటి ఇప్పుడు అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ప్లేయర్ ల్యూక్ జోంగ్వే ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి, ఆశ్చర్యపరిచాడు. బౌండరీ వద్ద రెండు సార్లు క్యాచ్ కి ప్రయత్నించినా మొత్తంగా తన మూడో ప్రయత్నంలో కళ్లు చెదిరే క్యాచ్ పట్టి, ప్రత్యర్ధి టీంకు ఊహించని షాక్ ఇచ్చాడు. అయితే ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం.
లక్ష్య ఛేదనలో ఒమన్ బ్యాట్స్‌మెన్ నిలకడాగా ఆడుతూ విజయానికి చేరువగా వస్తున్నారు. అయితే 46 ఓవర్లో కలీముల్లా బౌండరీ బాదేందుకు భారీ షాట్ ఆడాడు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న లూక్ జోంగ్వే వద్దకు బంతి చేరుకోగా.. జోంగ్వే మొదట బంతిని పట్టుకుని బౌండరీ లైన్ వద్ద టచ్ చేసినట్లే అనిపించాడు. కానీ, వెంటనే తేరుకొని బంతిని గాలిలోకి విసిరి వెనుకకు వచ్చి మరోసారి క్యాచ్ అందుకున్నాడు. ఒక దశలో సిక్సర్ అని భావించినా.. బ్యాలన్సు చేస్తూ బంతిని మిస్ అవ్వకుండా చేసిన విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ క్యాచ్ ని ఐసీసీ “వాట్ ఎ క్యాచ్ బై ల్యూక్ జోంగ్వే!” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసింది. మొత్తానికి జోంగ్వే పట్టిన ఈ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.