ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కానీ.. ఆ సంతోషాన్ని ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంటుంటారు సెలబ్రిటీలు. ఇక తమ పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే.. ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి.. పెళ్లి జరిగే వరకు ప్రతీ అప్డేట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలిపాడు స్టార్ క్రికెటర్. తాజాగా తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు ఆ స్టార్ పేసర్. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జింబాబ్వే స్టార్ పేసర్ రిచర్డ్ నగరవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడులకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వేడుకల్లో తనకు కాబోయే భార్యతో రకరకాల ఫోజులు పెడుతూ.. ఫోటోలకు స్టిల్స్ ఇచ్చాడు రిచర్డ్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక రిచర్డ్ నగవర జింబాబ్వే తరపున స్టార్ పేసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 25 సంవత్సరాల ఈ యువ సంచలనం రాబోయే రోజుల్లో జింబాబ్వే బౌలింగ్ దళానికి ప్రాతినిధ్యం వహిస్తాడని క్రీడానిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన రిచర్డ్.. తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ.. అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 27 వన్డేల్లో 5.7 ఎకానమీతో 28 వికెట్లు తీశాడు. 31 టెస్టుల్లో 7.76 సగటుతో 31 వికెట్లు పడగొట్టాడు. ఇక నిశ్చితార్థం వేడుక ఫోటోలను చూసిన అభిమానులు రిచర్డ్ నగరవకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Zimbabwe pacer Richard Ngarava gets engaged 💍❤️
📸: @RichardRbidza pic.twitter.com/4TnuqmEuyo
— CricTracker (@Cricketracker) January 8, 2023