పసికూన జింబాబ్వే టీమిండియాపై ఒక అరుదైన రికార్డును నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల భారీ తేడాతో గెలిస్తే.. జింబాబ్వే రికార్డు సాధించడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. మ్యాచ్‌ను భారత్ గెలిచినా ఒక విషయంలో టీమిండియా బౌలింగ్‌ను సవాలు చేస్తూ.. జింబాబ్వే ఒక అరుదైన రికార్డును నమోదు చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ బౌలర్ల జింబాబ్వే బ్యాటర్లను ఆరంభంలో వణికించారు. టపటప వికెట్లు పడేస్తూ.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చారు. కానీ.. తొమ్మిదో వికెట్ తీసేందుకు మాత్రం చెమటలు కక్కారు.
జింబాబ్వే బ్యాటర్లు నగరవ(34), బ్రాడ్ ఎవాన్స్(33) భారత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే తొమ్మిందో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియాపై తొమ్మిదో వికెట్‌కు జింబాబ్వేకిదే అత్యధిక పార్ట్నర్‌షిప్. 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే మరో 10, 15 పరుగులు చేసి చాపచుట్టేస్తుందని అంతా భావించారు. కానీ.. నగరవ, బ్రాడ్ ఎవాన్స్ టీమిండియా బౌలర్లపై ఎదురుదాటికి దిగారు. దీంతో జింబాబ్వేకు ఊహించని విధంగా గౌరవప్రదమైన స్కోర్‌తో పాటు టీమిండియాపై తొమ్మిదో వికెట్ రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్‌షిప్ నమోదైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చకబ్వ(35), నగరవ(34), బ్రాడ్ ఎవాన్స్(33) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఇక 190 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఓపెనర్లు ఊదేశారు. జింబాబ్వే బౌలర్లకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా.. శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81, శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 82 పరుగులు చేసి భారత్‌కు 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్.. మూడు వన్డేలో సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియాపై జింబాబ్వే తొమ్మిదో వికెట్‌కు 70 పరుగుల పార్ట్నర్‌షిప్ నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు తొలి విజయం! తిట్టిపోస్తున్న ఇండియన్ ఫ్యాన్స్
#1stODI | INNINGS BREAK: 🇿🇼 bowled out for 189 in 40.3 overs
Richard Ngarava and Brad Evans put on 70-run together, the highest ninth-wicket partnership for 🇿🇼 against India#ZIMvIND | #KajariaODISeries | #VisitZimbabwe pic.twitter.com/H9bQa4giSa
— Zimbabwe Cricket (@ZimCricketv) August 18, 2022