ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎలా పోరాడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అపుడప్పుడు స్లెడ్జింగ్ చేసుకోవడం, ఛీటింగ్ చేయడం లాంటి విషయాలు కూడా కనిపిస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
యాషెస్ 2023 లో భాగంగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నిన్న ప్రారంభమైంది. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బజ్ బాల్ క్రికెట్ అంటూ కొత్త రకం ఫార్ములా కనిపెట్టిన ఇంగ్లాండ్ అదే పంథాలో దూసుకెళ్లింది. తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ ఆసాంతం ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ రన్ రేట్ 5 పైగా ఉండడం గమనార్హం. ఇంగ్లాండ్ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ అందరిది 60 కి పైగానే ఉంది. రూట్ సెంచరీతో(118) చెలరేగగా.. బెయిర్ స్టో(78) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 78 ఓవర్లలో 8 వికెట్లకు 393 పరుగులు వద్ద డిక్లర్ చేసింది. అయితే చేతిలో మరో రెండు వికెట్లు ఉన్నా.. తొలి రోజు ఆట అయినా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిక్లెర్ చేయడం షాకింగ్ గా అనిపించింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో ఓపెనర్ క్రాలి ఛీటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది.
ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎలా పోరాడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అపుడప్పుడు స్లెడ్జింగ్ చేసుకోవడం, ఛీటింగ్ చేయడం లాంటి విషయాలు కూడా కనిపిస్తాయి. తొలిరోజు ఆటలో భాగంగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. బొలాండ్ వేసిన 27 ఓవర్లో నాలుగో బంతి ఓపెనర్ క్రాలి బొటన వేలును క్లియర్ గా తాకి వెళ్లినా అతడు మాత్రం నాకేమి తగలలేదన్నట్లుగా చూసాడు. దీంతో రివ్యూకి వెళ్లిన ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది. అంపైర్ కి అర్ధం కాకపోవడంలో అర్ధం ఉంది. కానీ బాల్ బొటన వేలుని తాకినా క్రాలి మాత్రం గ్రీజ్ వీడలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ లో జెంటిల్మన్ క్రికెట్ ఆడాల్సింది పోయి ఇలా ఛీటింగ్ చేయడం ఇంగ్లాండ్ కొంప ముంచింది. క్రాలి ఔటవ్వడంతో పాటుగా.. ఇంగ్లాండ్ ఛీటింగ్ అనే ముద్ర వేసుకుంది. మొత్తానికి క్రాలి చేసిన ఈ పని మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.