శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో భారత్ భారీ విజయం సాధించిన సంగతి మనందరికి తెలిసిందే. దాంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపాడు టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. సూనామీ ఇన్నింగ్స్ తో సెంచరీ సాధించిన సూర్యకుమార్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాత్కాలిక కెప్టెన్ పాండ్యాతో పాటుగా కోచ్ ద్రవిడ్ సైతం సూర్యపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే లంకతో మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లో జరిగిన సెలబ్రేషన్స్ లో సూర్యకుమార్ కు అనుకోని సర్ ప్రైజ్ ఇచ్చాడు లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్.
సాధారణంగా ఏ ఆటగాడైనా అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తే.. అతడి ఆటను మాటలతో పొగుడుతారు.. లేదా ఓ హగ్ ఇచ్చి మెచ్చుకుంటారు. కానీ తాజాగా లంకతో జరిగిన మ్యాచ్ లో.. హీరో సూర్యకుమార్ కు అరుదైన సర్ ప్రైజ్ ఇచ్చాడు టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్. భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అందరు గ్రౌండ్ లో ఒకరికి ఒకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. అందరు ఈ మ్యాచ్ హీరో సూర్యకు అభినందనలు తెలుపుతుంటుంటే.. చాహల్ మాత్రం వెరైటీగా తన ప్రేమను చాటుకున్నాడు. సెంచరీ హీరో సూర్య చేతిని కళ్లకు అద్దుకుని, ముద్దు పెట్టుకున్నాడు చాహల్.
Yuzvendra Chahal on behalf of every Indian cricket fan 💙😄
📸: Disney+Hotstar@yuzi_chahal | @surya_14kumar | #CricketTwitter pic.twitter.com/v8fJQKJIqi
— CricTracker (@Cricketracker) January 8, 2023
ఈ క్రమంలోనే చాహల్ భావొద్వేగానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఎప్పుడూ ఇతర ఆటగాళ్లను ఆటపట్టిస్తూ.. నవ్విస్తూ.. ఉండే చాహల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు. SKY ఆటకు చాహల్ ఇచ్చిన సూపర్ గెశ్చర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకోవడమే కాకుండా.. దిగ్గజాల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు సూర్యకుమార్ యాదవ్.
— Guess Karo (@KuchNahiUkhada) January 8, 2023