టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ దగ్గరికెళ్లాలంటే చాలా భయమేసేదని అన్నాడు. వికెట్లు తీయకపోతే కోహ్లీ తనపై అరిచేవాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలంపాటు కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీకి ఆడిన చాహల్ కెరీర్ ఆరంభంలో కోహ్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను 2014లో తొలిసారి ఆర్సీబీ జట్టులోకి వెళ్లినప్పుడు చాలా ఆందోళనగా ఉండేదని, మైదానంలో కోహ్లీని చూస్తే భయమేసేదని పేర్కొన్నాడు.
తాను బౌలింగ్ చేసేటప్పుడు కోహ్లీ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ చాలా దూకుడుగా, ఎనర్జిటిక్‌గా ఉండేవాడని, అప్పుడు నేను కుర్రాడిగా ఉండటంతో ఒక్కోసారి వికెట్లు తీయకపోతే నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడని వెల్లడించాడు. అయితే, తాను వికెట్లు తీసినప్పుడు తన కోపాన్ని ప్రదర్శించడానికి కోహ్లీ వైపు వెళ్లకుండా బ్యాట్స్‌మెన్ వద్దకెళ్లేవాడినిని గుర్తుచేసుకున్నాడు. అలా రెండుమూడు సార్లు జరగడంతో మ్యాచ్ రిఫరీ తన గురించి అప్పటి ఆర్సీబీ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి కంప్లైయింట్ చేసినట్లు, తర్వాత వెట్టోరి తనని వారించినట్లు పేర్కొన్నాడు. మరి కోహ్లీపై చాహల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.