టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ తన సక్సెస్‌కు కారణం ఎవరో చెప్పాడు. చాలా సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతున్న ఈ మిస్టరీ స్పిన్నర్ తన సక్సెస్ వెనకాల న్యూజిలాండ్ లెజెండరీ ఆల్‌రౌండర్ డానియెల్ వెట్టోరీ ఉన్నట్లు పేర్కొన్నాడు. చాహల్ ఆర్సీబీకి ఆడుతున్న సమయంలో కొంతకాలం వెట్టోరీ ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తన విలువైన సలహాలు, సూచనలను తనకు ఇచ్చేవాడని చాహల్ పేర్కొన్నాడు.
అతనిచ్చిన సలహాలతోనే తాను అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నట్లు వెల్లడించాడు. నెట్స్‌లో వెట్టోరీ తనతో ఎక్కువ సమయం బౌలింగ్ చేయించే వాడని, బౌలింగ్ యాక‌్షన్ మార్చుకోకుండా.. ఎలా రాణించాలో వెట్టోరీ నేర్పించినట్లు పేర్కొన్నాడు. మరి చాహల్ సక్సెస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.