టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. మ్యాచ్ తర్వాత తోటి క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తూ.. సరదాగా రీల్స్ చేస్తూ తన అభిమానులతో ఫుల్ అప్డేటెడ్‌గా ఉంటాడు. చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన డాన్స్ వీడియోలను, కామెడీ రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. తన అభిమానులకు టచ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఇద్దరికీ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కలిసి కూడా చాలా రీల్స్ చేశారు. తాజాగా ఒక రొమాంటిక్ వీడియోను చాహల్ పోస్టు చేశాడు. ఆ వీడియోలో చాహల్ ధనశ్రీని ముద్దు కూడా పెట్టుకున్నాడు. ‘మై స్ట్రాంగెస్ట్ ఉమెన్ మై స్ట్రెంత్’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. కొన్ని వారాల క్రితం ఈ ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని.. ఇద్దరు విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ వర్మ చాహల్‌తో కాకుండా.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి వెళ్లడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘కొత్త జీవితం లోడింగ్’ అంటూ చాహల్ పోస్టు పెట్టడం. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు పక్కన చాహల్ పేరును ధనశ్రీ వర్మ తొలగించడంతో ఆ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. కానీ.. అవన్నీ వట్టి పుకార్లే అంటూ ఆ తర్వాత చాహల్, ధనశ్రీ క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా కొన్ని రోజులు చాహల్-ధనశ్రీ పేర్లు వార్తల్లో నిలిచాయి. తాజా వీడియోతో అసలు వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. కానీ.. ఈ వీడియో మరింత రొమాంటిక్ ఉండటం వైరల్‌గా మారింది.
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం బీసీసీఐ సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో యుజ్వేంద్ర చాహల్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇటివల ముగిసిన ఆసియా కప్ 2022లో కూడా చాహల్ మంచి ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. చాలా కాలంగా జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న చాహల్.. టీ20 వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి టీ20 వరల్డ్ కప్ 2022కు చాహల్ ఎంపికవ్వడంపై, అలాగే చాహల్ పోస్టు చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తెలుగు పాటకు.. ఇండియన్ క్రికెటర్ భార్య మాస్ డ్యాన్స్! వీడియో వైరల్