కెప్టెన్సీకి ‘విరాట్ కోహ్లీ’ గుడ్‌బై చెప్పినప్పుడు, ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడులే అని అనుకున్నారు. ఊహించినట్టుగానే.. టీ20, వన్డే, టెస్టు.. అన్ని సారధ్య బాధ్యతలు హిట్‌మ్యాన్‌కే దక్కాయి. పోనీ.. బాధ్యతలు చేపట్టాక కెప్టెన్ గా రోహిత్ రాణించలేదా? అంటే.. అదీకాదు.. వరుస విజయాలతో రికార్డు సృష్టించాడు. ఇదంతా నెల క్రితం ముందు. ఐపిఎల్ 2022 సీజన్ లో రోహిత్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఆడిన 8 మ్యాచుల్లో 143 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్ 41. ఇక.. రోహిత్ కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ ఆటతీరు అంతంత మాత్రమే. ఆడిన 8 మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యింది. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై దుమారం రేగుతోంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు 34 ఏళ్లు. ఇంకో 3 రోజులుంటే 35. దీంతో ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలు లేవు. ఈ క్రమంలో రోహిత్ వయస్సును దృష్టిలో పెట్టుకొని కెప్టెన్సీ మార్పుపై యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. భారత భవిష్యత్తు టెస్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను తీర్చిదిద్దాలని సెలక్టర్లకు సూచించైనా యువరాజ్.. ఉదాహరణగా ఎంఎస్ ధోనీని పేర్కొన్నాడు. 2007 వన్డే ప్రపంచ కప్‌లో దారుణ పరాభవం తర్వాత ‘రాహుల్ ద్రావిడ్’ టీమిండియా కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు 26ఏళ్ల ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే అనిల్ కుంబ్లే పదవీ విరమణ ప్రకటించాక.. ధోనీ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Rohit Sharma’s captaincy.. pic.twitter.com/0L6K8IgvsI
— RVCJ Media (@RVCJ_FB) April 25, 2022
ఇది కూడా చదవండి: తెరమీదకు రోహిత్ శర్మ బ్రేకప్ లవ్ స్టోరీ!
ఎలానూ.. ప్లేయింగ్ 11లో పంత్ స్థానం స్థిరంగా ఉన్నందున అతన్ని కెప్టెన్సీ వైపు ప్రోత్సహించాలనే సంకేతాలిచ్చాడు. అలాగే కెప్టెన్‌గా నిలదొక్కుకోవడానికి పంత్‌కు తగిన సమయం, సహకారం కూడా ఇవ్వాలని, అతని నుంచి అద్భుతాలు వెంటనే ఆశించకూడదని అభిప్రాయపడ్డాడు. పంత్‌కు ఇంకా కెప్టెన్ అయ్యేంత మెచ్యూరిటీ లేదంటున్న విమర్శకుల అభిప్రాయాలను యువరాజ్ సింగ్ తోసిపుచ్చాడు. ఇందుకు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాలని కోహ్లీని సెలెక్టర్లు కోరినప్పుడు.. కోహ్లీ ఆ సమయంలో కెప్టెన్సీ కాగలిగే మెచురిటీ తనకు లేదని పేర్కొన్నాడని యువరాజ్ తెలిపాడు.
#Cricket @RishabhPant17 should be groomed for Test team captaincy: @YUVSTRONG12 🏏
Since his debut in 2018, #RishabhPant has been one of the integral members of the Test side
Read More ▶️ https://t.co/vPKDFisjLu pic.twitter.com/eVS8dSLzxI
— TOI Sports (@toisports) April 27, 2022
‘ఇప్పటినుంచే టెస్టు కెప్టెన్ కోసం ఎవరినైనా సిద్ధం చేయాలి. గతంలోనూ ధోనీని కెప్టెన్‌గా నియమించినప్పుడు నిదానంగా అతను నిలదొక్కుకొని.. ప్రపంచంలోనే గొప్ప కెప్టెన్‌లలో ఒకడిగా మారాడు. అలాగే మీరు టెస్టు క్రికెట్‌కు కాబోయే కెప్టెన్‌గా యంగ్ ప్లేయర్‌ను ఎంచుకోండి. అతనికి కొంత టైం ఇవ్వండి. ఆరు నెలలు లేదా సంవత్సరం వరకు అతని కెప్టెన్సీని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వెంటనే అద్భుతాలు జరగవు.’ అని యువరాజ్ పేర్కొన్నాడు.
Loved this attitude from Rishabh Pant.
Captains fighting hard for wrong umpiring 👍🔥🔥#RR #RRvsDC #Pant #RishabhPant #NoBall #umpire pic.twitter.com/xOQLAFP8Ai— Kshitij Umarkar Patil (@itsKshitijPatil) April 22, 2022
ఇది కూడా చదవండి: నో బాల్ వివాదంపై చర్చ! ఆ రోజు ధోని చేసింది కరెక్టయితే ఇవాళ పంత్ చేసింది కరక్టే!