మెుహాలి వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ అన్ని రంగాల్లో దారుణంగా విఫలం అయ్యింది. ప్రత్యర్థి జట్టు అన్ని రంగాల్లో టీమిండియాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దాంతో 4 వికెట్ల తేడాతో ఆసిస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ను వీక్షించడానికి టీమిండియా మాజీ క్రికెటర్లు ఇద్దరు హాజరైయ్యారు. వారెవరో కాదు డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్, బౌలర్ హర్భజన్ సింగ్ లు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ వీరు ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. అదీ కాక కింగ్ కోహ్లీతో యువీ సీరియస్ గా మ్యాచ్ గురించి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
యువరాజ్.. హర్భజన్ సింగ్ లు క్రికెట్ లో దేశానికి ఎన్నో సేవలు చేశారు. అందుకుగాను వారి సేవలు గుర్తించిన పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ మెుహాలీ స్టేడియంలోని రెండు స్టాండ్స్ కు వీరిద్దరి పేర్లు పెట్టింది. ఈ క్రమంలోనే వీరిద్దరిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రత్యేకంగా సత్కరించారు. అయితే భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే? కింగ్ విరాట్ కోహ్లీ.. యువరాజ్ సింగ్ లు చాలా సీరియస్ గా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని స్టార్ స్పోర్ట్స్ ఇండియా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి”స్టార్ డమ్ ఓవర్ లోడెడ్” అంటూ క్యాప్షన్ సైతం ఇచ్చింది.
ఇక విరాట్ ప్యాడప్ అయ్యి ఉండగా గ్రౌండ్ లోకి వచ్చిన యువీ.. కోహ్లీతో చాలా సీరియస్ గా కొద్దిసేపు డిస్కషన్ చేశాడు. వారు ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారో తెలీదు కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. నెటిజన్స్ మాత్రం మ్యాచ్ గురించి, ప్లేయర్ల గురించే మాట్లాడుకుని ఉంటారని రాసుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ ఇద్దరి దిగ్గజాలను ఒకే ఫ్రేమ్ లో చూడటంతో గ్రౌండ్ లో కేరింతలు కొట్టారు. వారి ఆనందానికి అంతులేదు. మరి యువరాజ్-కోహ్లీల డీప్ డిస్కషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.